Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలంలో సరికొత్త రికార్డ్.. గజం రూ.1.80 లక్షలు.. ఏకంగా రూ.366 కోట్ల ఆదాయం!

Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ హెచ్‌బీ కాలనీ భూముల ఈ-వేలంలో గజం ధర రూ.1.80 లక్షలు పలకగా, తొలి విడతలోనే రూ.366 కోట్ల ఆదాయం సమకూరింది.

Vizag steel plant rinl land auction hb colony fetches 366 crore nlmc

Vizag Steel Plant Land Auction: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తూ, నగరంలో నిరుపయోగంగా ఉన్న తమ భూముల విక్రయ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నగర నడిబొడ్డున ఉన్న హెచ్‌బీ కాలనీలోని భూములకు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC) ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి విడత ఈ-వేలానికి ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. 35 ఏళ్ల క్రితం క్వార్టర్ల కోసం కేటాయించిన ఈ ప్రాంగణం ప్రధాన రహదారి, జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో కొనుగోలుదారులు వేలం పాటలో హోరాహోరీగా పోటీపడ్డారు.

Read Also – Chandrababu-Vijay Meeting: చంద్రబాబు-విజయ్ భేటీ.. చెన్నై తాగునీటి సమస్యపై కీలక నిర్ణయం.. తెలుగు గంగ నీటి పెంపునకు ఏపీ సానుకూలత!

గజం రూ. 1.80 లక్షలు.. తొలి విడతలోనే రూ. 366 కోట్లు సాధన:

ఈ ఈ-వేలంలో విశాఖ రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను చాటిచెబుతూ హెచ్‌బీ కాలనీలో గజం భూమి ధర అత్యధికంగా రూ. 1.80 లక్షలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 150 ప్లాట్లను విక్రయించడం ద్వారా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు రూ. 366 కోట్లకు పైగా భారీ రాబడి సమకూరింది. గతంతో పోలిస్తే ఈసారి పొందిన ఆదాయం 17 శాతం అధికంగా నమోదు కావడం విశేషం. శిథిలావస్థకు చేరిన క్వార్టర్లను తొలగించి, ఆ నిరర్ధక ఆస్తులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తమ ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగింది.

ముందుకు సాగుతున్న నిరర్ధక ఆస్తుల విక్రయ ప్రణాళిక:

కేంద్ర ప్రభుత్వం 2022లో ఏర్పాటు చేసిన ఎన్‌ఎల్‌ఎంసీ పర్యవేక్షణలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యం లేని ఆస్తుల విలువను వెలికితీసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. విశాఖపట్నంతో పాటు హైదరాబాద్‌లో ఉన్న ఆర్‌ఐఎన్‌ఎల్ ఆస్తులను కూడా త్వరలోనే దశలవారీగా వేలం వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతలోనే రూ.366 కోట్లు రావడంతో, తదుపరి విడతల్లో జరగబోయే భూముల వేలం ద్వారా స్టీల్ ప్లాంట్‌కు మరిన్ని నిధులు సమకూరి, సంస్థ ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మార్గం సుగుమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.