Vijayawada: ఎన్టీఆర్ వద్దంటూ 27 ఏళ్ల క్రితం వ్యాఖ్యానించిన చంద్రబాబు.. విజయవాడ వీధుల్లో వార్తా క్లిప్పులు వైరల్

అప్పటి రాజకీయాల నేపథ్యంలో ‘మనకు ఎన్డీఆర్ అవసరం లేదు’ అని చంద్రబాబు అన్నట్లు.. డెక్కన్ క్రోనికల్ అనే వార్తా పత్రికలో వచ్చిన వార్తను ప్రింట్ తీసి రోడ్లపై అతికించారు. ప్రభుత్వ, వైసీపీ మద్దతు దారులే ఇది చేసుంటారనే అనుమానాలు బలంగానే ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ పేరు మార్పుపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చంద్రబాబుకు ఇది గట్టి ఎదురు దెబ్బలాగే తగిలింది. అయితే దీన్ని టీడీపీ నేతలు ఎలా తిప్పి కొడతారో చూడాలి.

YSR Health University: విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ రగడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు సహా, నందమూరి కుటుంబం, అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అయితే 27 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ వద్దంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా క్లిప్పులు ప్రస్తుతం విజయవాడ రోడ్లపై అడుగడుగునా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అప్పటి రాజకీయాల నేపథ్యంలో ‘మనకు ఎన్డీఆర్ అవసరం లేదు’ అని చంద్రబాబు అన్నట్లు.. డెక్కన్ క్రోనికల్ అనే వార్తా పత్రికలో వచ్చిన వార్తను ప్రింట్ తీసి రోడ్లపై అతికించారు. ప్రభుత్వ, వైసీపీ మద్దతు దారులే ఇది చేసుంటారనే అనుమానాలు బలంగానే ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ పేరు మార్పుపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చంద్రబాబుకు ఇది గట్టి ఎదురు దెబ్బలాగే తగిలింది. అయితే దీన్ని టీడీపీ నేతలు ఎలా తిప్పి కొడతారో చూడాలి.

Mukul Rohatgi: అటార్నీ జనరల్ పదవి ఆఫర్‭ను తిరస్కరించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి

ట్రెండింగ్ వార్తలు