AP Rains : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్.. 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు
AP Rains : ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది.
- Dharani Pilli
- Published On : March 21, 2026 / 06:50 AM IST
weather update two more days rain in andhra pradesh march 2026
AP Rains : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో నేడు ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం నాడు వైజాగ్, సత్యసాయి, అనకాపల్లి, ఎన్టీఆర్, విజయనగరం, గుంటూరు, బాపట్ల, అనంతపురం.. అలాగే రేపు విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడవద్దని సూచించింది. ఆకస్మిక వర్షాల పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
