బంగాళాఖాతంలో వాయుగుండం బలహీన పడింది. సాగర్ ఐలాండ్, ఖేపూపెర మధ్య నిన్న వాయుగుండం తీరం దాటింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయి. అలాగే, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
నైరుతి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమతో పాటు మరికొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే RCBనే IPL టైటిల్ విన్నర్..
మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, అవసరమైన సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.