Wife Murdered Husband : ప్రియుడి మోజులో భర్తను చంపేసింది.. గుండెపోటుగా నమ్మించింది.. కానీ, ఆ ఒక్క మెస్సేజ్‌తో.. చివరి వరకు ట్విస్టులే ట్విస్టులు..

Wife Murders Husband With Lover :వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది.

Kakinada murder case

Wife Murders Husband With Lover : అనారోగ్యంతో భర్త ఇంటికే పరిమితం అయ్యాడు.. భర్త, పిల్లలను చూసుకుంటూ కుటుంబానికి అండగా నిలవాల్సిన భార్య తప్పుడుదారిని ఎంచుకుంది. ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ప్రియుడు ఇంటికొచ్చి వెళ్తుండేవాడు.. భర్తకు విషయం తెలిసి భార్యను మందలించాడు.. దీంతో భర్తపై కోపం పెంచుకున్న ఇల్లాలు.. అతన్ని చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడుతో కలిసి ప్లాన్ వేసింది. ప్రియుడు నిద్రమాత్రలు తీసుకొచ్చి ఇవ్వగా.. వాటిని జ్యూస్‌లో కలిపి భర్తకు ప్రేమగా ఇచ్చింది. జ్యూస్ తాగి పడిపోగా.. దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తరువాత బంధువులను గుండెపోటుగా నమ్మించింది. కానీ, కొద్దిరోజులకు ప్రియుడు పెట్టిన మెస్సేజ్‌తో వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది.

Also Read : Cancer Cases Rising in Chintalapudi : 10టీవీ ఎఫెక్ట్.. చింతలపూడి నియోజకవర్గంలో కోరలుచాచిన కాన్సర్‌పై వరుస కథనాలు.. కదిలొచ్చిన అధికార యంత్రాంగం.. స్పందించిన మంత్రి

కాకినాడ జిల్లా సర్పవరంకు చెందిన దుర్గా ప్రసాద్ ఆటో నడుపుకుంటూ భార్య, ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్నాడు. అయితే, రెండేళ్ల క్రితం అతనికి గుండెపోటు రావడంతో స్టంట్లు వేయించుకున్నాడు. ఆ తరువాత ఆటోను వదిలేసి ఇంటికే పరిమితం అయ్యాడు. భర్త మంచాన పడిన బాధకూడా లేకుండా భార్య నిత్యం ఫోన్ లో కాలక్షేపం చేస్తుండేది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయి అనే వ్యక్తితో పరిచయమైంది. వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్ధరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గోపి సాయి తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.

భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త.. పలుసార్లు నిలదీశాడు. తప్పుడు పనులు మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో భర్తపై ఆమె కోపం పెంచుకుంది. ప్రియుడుతో కలిసి భర్తనే చంపేసేందుకు ప్లాన్ వేసింది. అనుకున్న ప్లాన్ ప్రకారం.. ప్రియుడితో నిద్రమాత్రలు తెప్పించింది. వాటిని జ్యూస్ లో కలిపి భర్తకు ప్రేమగా తాపించింది. అతను నిద్రలోకి జారుకోగా.. దిండుతో ముఖంపై బలంగా ఒత్తిపట్టి ఊపిరాడకుండా చేసింది. దీంతో దుర్గా ప్రసాద్ ఊపిరాడక చనిపోయాడు. కుటుంబ సభ్యులను గుండెపోటుగా నమ్మించింది. బంధువులు, స్థానికులుసైతం అదే నిజమని నమ్మేశారు.

అయితే కొంతకాలం తర్వాత మహిళ తన ప్రియుడిని దూరం పెట్టడంతో అనుమానం పెంచుకున్న అతడు, దుర్గాప్రసాద్ మరణంపై కీలక సమాచారాన్ని ఆమె కుమార్తెలకు తెలియజేశాడు. మీ తండ్రిది సహజ మరణం కాదని.. మీ తల్లే తండ్రికి నిద్ర మాత్రలు ఇచ్చి చంపేసిందని వాట్సప్ మెసేజ్ చేశాడు. దీంతో దుర్గా ప్రసాద్ ఇద్దరు కూతుళ్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.