Vizianagaram Politics : వైసీపీని వీడుతున్న కీలక నేతలు.. జడ్పీపీఠంపై చిన్న శ్రీను పంతం నెగ్గించుకుంటారా.?
Vizianagaram Politics : పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత విజయనగరం జిల్లా పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
- Harish Thanniru
- Published on- November 15, 2026 / 02:39 PM IST
Vizianagaram Politics
Vizianagaram Politics : పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత విజయనగరం జిల్లా పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ..టీడీపీ నుంచి చిన్న శ్రీను అన్నీ తామై పరిషత్ ఫైట్‌లో ముందుండి పోరాడారు. థర్టీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ను ఉపయోగించి..ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టు నిలుపుకునేందుకు బొత్స చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే తన కోడలు పూజితను గరివిడి జడ్పీటీసీగా, తన చెల్లి వెంకటలక్ష్మిని గుర్ల జడ్పీటీసీగా గెలిపించుకున్నారు. కానీ బొత్స కూతురు అనూష బొండపల్లి నుంచి ఓడిపోయారు. అక్కడ టీడీపీ అభ్యర్థి నీరజ జడ్పీటీసీ అయ్యి జడ్పీ ఛైర్పర్సన్లో కొనసాగుతున్నారు.
తన కూతుర్ని జడ్పీటీసీగా గెలిపించుకొని జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పొలిటికల్ అరంగేట్రం చేయించాలని బొత్స భావించారు. పైగా జడ్పీ ఛైర్ పర్సన్‌గా తన కూతురు పేరును కూడా ప్రకటించారు. ఇక్కడే చిన్న శ్రీను, బొత్సకు గ్యాప్ వచ్చిందని అంటుంటారు. ఈ క్రమంలో టీడీపీలో చేరిన బొత్స అల్లుడు చిన్న శ్రీను తన మార్క్ రాజకీయంతో..తన కూతురు సిరి సహస్రను తెర్లాం నుంచి జడ్పీటీసీగా గెలిపించుకొని..జడ్పీ ఛైర్మన్ రేసులో ఉంచారు. అయితే ఆమె కుల వివాదం నడుస్తున్న వేళ..చిన్న శ్రీను కూతురు జడ్పీ పీఠం దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. చిన్న శ్రీను వెంట వైసీపీ కీలక నేతలంతా సైకిల్ ఎక్కడం..పట్టు కోసం బొత్స తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందట. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో 27 జడ్పీటీసీలకు గాను కూటమి 20 సీట్లు సొంతం చేసుకుంటే..వైసీపీ ఏడు స్థానాలోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు.
చిన్న శ్రీను అన్నీ తానై జడ్పీ పీఠంపై టీడీపీ జెండా ఎగరవేసేందుకు పక్కా స్కెచ్‌తో పనిచేశారని అంటున్నారు. బొత్స కోడలు, చెల్లి గెలిచినా..వైసీపీకి జడ్పీ పీఠం దక్కకపోవడం..తన కూతురును జడ్పీ ఛైర్పర్సన్ను చేయాలనుకున్న బొత్స ఆశలు ఆదిలోనే బ్రేకులు వేయడంలో చిన్న శ్రీను పైచేయి సాధించినట్లు చెప్పుకుంటున్నారు. పైగా విజయనగరం జడ్పీ పీఠం కూటమికి దక్కడంలో చిన్న శ్రీను కీరోల్ ప్లే చేశారంటోంది ఆయన వర్గం. జిల్లా రాజకీయాలపై చిన్న శ్రీనుకు మంచి అవగాహన ఉండటం జడ్పీ ఎన్నికల్లో కూటమికి కలిసొచ్చినట్లు చెప్తున్నారు.
చిన్న శ్రీను ప్రభావం లేదని చెప్పేందుకు వైసీపీ గట్టి ప్రయత్నమే చేసినా..ఏడు సీట్లకే పరిమితం కావడం క్యాడర్‌ను నిరాశ పరిచిందట. అయితే చిన్న శ్రీను మనసు మాత్రం జడ్పీ పీఠంపైనే ఉందట. తన కూతురును జడ్పీటీసీగా గెలిపించుకున్న ఆయన..సిరి సహస్ర కుల ధృవీకరణ పత్రంపై రాద్దాంతం కొనసాగుతుండటంతో..డైలమాలో పడిపోయారట. మరోవైపు టీడీపీలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇంకో సవాల్‌గా మారాయట. మరోవైపు బొత్స అనూషను ఓడించిన నీరజ జడ్పీ ఛైర్పర్సన్ రేసులోకి రావడంతో..జడ్పీ పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోందట.
విజయనగరం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైన కోటను నిర్మించుకున్న బొత్స..అల్లుడు ప్రత్యర్థి తరఫున నిలబడిన వేళ సవాళ్లు ఫేస్ చేయాల్సి వస్తుందట. డీసీసీబీ ఛైర్మన్‌గా ప్రస్థానం ప్రారంభించి ఎంపీగా..మంత్రిగా..ఉమ్మడి రాష్ట్రంలో సీఎం స్థాయికి ఎదిగారు. ఇప్పుడు మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే బొత్స పొలిటికల్ జర్నీలో..ఆయన తోడుగా మేనల్లుడిగా చిన్న శ్రీను కీలకంగా ఎదిగారు. చిన్న శ్రీను పార్టీని వీడిన తర్వాత..గతంలో జిల్లాను శాసించిన బొత్స తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేన్నట్లుగా పట్టు కోసం జిల్లాలోనే పాగా వేయాల్సి వచ్చిందట.
తన రాజకీయ వారసురాలిగా కుమార్తె అనూషను జడ్పీ ఛైర్పర్సన్ను చేయాలని బొత్స అనుకుంటే.. ఆమె జడ్పీటీసీ ఓడిపోయారు. బొత్స తన వారసురాలిగా కూతురును తెరపైకి తేవడం వల్లే.. చిన్న శ్రీను సైకిల్ ఎక్కారనే టాక్ ఉంది. సిట్టింగ్ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న చిన్న శ్రీను మరోసారి జడ్పీ పీఠంపై కన్నేశారని తెలిసి కూడా.. బొత్స తన కుమార్తె అనూషను జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ప్రకటించడంతో చిన్న శ్రీను హర్ట్ అయ్యారట. ఈ క్రమంలోనే తన రాజకీయ భవిష్యత్..తన కూతురు పొలిటికల్ అరంగేట్రం కోసం అధికార పార్టీలోకి వెళ్లారని అంటున్నారు. ఆ తర్వాత మామ, అల్లుడు ఇద్దరు జనం దగ్గరికే వెళ్లి తేల్చుకున్నారు. బొత్స అనూష ఓటమి..సిరి సహస్ర గెలుపుతో చిన్న శ్రీను పైచేయి సాధించినట్లు అయిందన్న చర్చ నడుస్తోందట.
తన కుమార్తె సిరి సహస్త్రను గెలిపించుకొన్న చిన్న శ్రీను.. జడ్పీ పీఠంపై తన కూతును కూర్చోబెడితే మాత్రం బొత్సపై పైచేయి సాధించినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. బొత్స తన రాజకీయ వారసురాలిని ఎలా నిలబెడుతారో.? తిరిగి పట్టు సాధించేందుకు ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాలి మరి.
