Korean Disease : ప్రమేయం లేకుండానే కాళ్లు, చేతులు కదులుతున్నాయి.. నోట్లో ముద్దను తోసేస్తున్న నాలుక

భోజనాన్ని నాలుక తోసేయడం వల్ల..ఆహారం అందలేదని దీంతో ఆమె పోషకాహార లోపంతో బాధ పడుతున్నట్లు తేలిందని డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స...

Kurnool City

Woman Has Contracted Korean Disease : ఎలాంటి ప్రమేయం లేకుండానే కాళ్లు, చేతులు కదులుతున్నాయి. నోట్లో అన్నం ముద్దను..లేదా ఇతర ఆహారం పెడితే.. వెంటనే నాలిక బయటకు తోసేస్తుంది. ఏమి జరుగుతుందో ఆమెకే అర్థం కావడం లేదు. కుటుంసభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఏమి చేయాలో వారికి తోచలేదు. దయ్యం పట్టిందేమోనని మంత్రాలు చేయించారు..తాయెత్తులు కట్టించారు. అయినా ఫలితం కనబడలేదు. భూతవైద్యులను సైతం ఆశ్రయించారు. తెలియకుండా కాళ్లు, చేతులు కదులుతుండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

Read More : Amjad Basha: 26 జిల్లాల్లో ప్రతీ ప్రాంతానికి అభివృద్ధి విస్తరిస్తాం – డిప్యూటీ సీఎం

కర్నూలు జిల్లాలో ఓ ప్రాంతంలో వీరేషమ్మ నివాసం ఉంటోంది. ఈమె వయస్సు 32. కానీ చూడటానికి మాత్రం పైబడిన మహిళగా కనబడుతుంది. అనారోగ్యం బారిన పడడం..కాళ్లు, చేతులు తన ప్రమేయం లేకుండానే నిత్యం కదులుతుండడంతో ఆమె తీవ్ర అవస్థలు పడింది. తినేందుకు నోట్ల ముద్ద పెడితే.. నాలుక అమాంతం దానిని బయటకు తీసేస్తుంది. కుటుంబసభ్యులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అందర్నీ ఆశ్రయించారు. కానీ ఫలితం రాలేదు. చివరకు కర్నూలుకు చెందిన న్యూరో ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ కుమార్ అదోనీ క్యాంపునకు వచ్చారు.

Read More : CM KCR : 33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమించిన సీఎం కేసీఆర్

అక్కడకు వెళ్లిన వీరేషమ్మ కుటుంబసభ్యులు ఆమె పరిస్థితి వివరించారు. వైద్య పరీక్షల కోసం అహ్మాదాబాద్ లో ఉన్న హోల్ ఎక్వీమ్ స్వీక్వెన్సింగ్ జెనటిక్ కు పంపించారు. రెండు రోజుల క్రితం నివేదిక వచ్చింది. “కొరియా అకాంటో సైటోసిస్” అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు గుర్తించారు. దాదాపు ప్రపంచంలో ఇలాంటి సమస్యతో కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. భోజనాన్ని నాలుక తోసేయడం వల్ల..ఆహారం అందలేదని దీంతో ఆమె పోషకాహార లోపంతో బాధ పడుతున్నట్లు తేలిందని డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స అందించడంతో ప్రస్తుతం సాధారణస్థితికి వచ్చిందన్నారు.