Kakani Govardhan Reddy : జైలు నుంచి విడుదలైన కాకాని గోవర్ధన్ రెడ్డి.. టీడీపీ నేతలపై కీలక కామెంట్స్..
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) బుధవారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు కాకానికి స్వాగతం పలికారు.

Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy : కేసులు, జైళ్లు మమ్మల్ని ఆపలేవు.. టీడీపీ నేతలు చేసే దోపిడీ మీద భవిష్యత్తులో విచారణ ఉంటుందని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) అన్నారు. బుధవారం ఉదయం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు కాకానికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై కీలక కామెంట్స్ చేశారు.
Also Read: TTD : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. తిరుమల వెళ్లే మహిళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
మంగళవారమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది.. నిన్న ఎందుకో వాయిదా పడింది. విడుదల వాయిదా పడటంతో మరో కేసు ఉంటుందేమోనని అనుకున్నా. నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. ఏడు పీటీ వారెంట్ లు వేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని కాకాని అన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలే నా ఆస్తి. కేసులు గురించి ఎక్కడ ప్రస్తావించకూడదు.. అందుకే మాట్లాడటం లేదని అన్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, మంత్రిగా పనిచేసిన నన్ను చాలా రోజులు జైల్లో పెట్టారు. ఏడు పీటీ వారెంట్స్ వేశారు. ఎన్నికల సమయంలో జరిగిన లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేశారు. వైసీపీ అధినేత జగన్ జిల్లాకు రావడానికి కూడా నిబంధనలు పెట్టారు. అయినా నాకోసం జగన్ జిల్లాకు వచ్చారు. వైసీపీ నేత ప్రసన్న ఇంటిపై దాడి చేశారు. ఆయన మీదకే కేసు పెట్టారంటూ టీడీపీ నేతలపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసులు, జైళ్లు మమ్మల్ని ఆపలేవు. టీడీపీ నేతలు చేసే దోపిడీ మీద భవిష్యత్తులో విచారణ ఉంటుందని కాకాని హెచ్చరించారు. తప్పు చెయ్యలేదు బెయిల్ ఇవ్వమని కోరాను తప్పా.. ఆరోగ్యం బాగాలేదని ఎప్పుడు బెయిల్ అడగలేదు. మా పందా కొనసాగుతూనే ఉంటుంది. జైలు మొత్తం వైఎస్ఆర్ సీపీ నేతలే ఉన్నారు. ధైర్యంగా పోరాడతాం. ఎక్కడ ఉన్నా నా పోరాటం ఆగదని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.