×
Ad

Cm Chandrababu: మారకపోతే మీకే నష్టం, సీల్డ్ కవర్‌లో నివేదిక- ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే. మంత్రి లోకేశ్ తన పని తాను చేస్తున్నాడు, నా పని నేను చేస్తున్నా అని చంద్రబాబు తెలిపారు.

  • Published On : February 14, 2026 / 05:05 PM IST

Cm Chandrababu Naidu Representative Image (Image Credit To Original Source)

  • 95-96 మాదిరిగానే ఈసారి నిక్కచ్చిగా ఉంటా
  • మొత్తం 9 పేరా మీటర్లలో సర్వే చేయించి నివేదిక ఇస్తున్నా
  • నేతలతో మానవీయ బంధం, మోటివేషన్ రెండూ భయం-భక్తిలా ఉండాలి

 

Cm Chandrababu: అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ లో పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మారకపోతే మీకే నష్టం అని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్ లో ఇచ్చే నివేదిక ద్వారా వారిని వారికి అద్దంలో చూపిస్తున్నా అని చెప్పారు. 95-96 మాదిరిగానే ఈసారి నిక్కచ్చిగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తం 9 పేరా మీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నా అని తెలిపారు. వారికి తెలియని ఇంకొన్ని పేరా మీటర్లు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు.

మంత్రి లోకేశ్ తన పని తాను చేస్తున్నాడు, నా పని నేను చేస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. నేతలతో మానవీయ బంధం, మోటివేషన్ రెండూ భయం-భక్తిలా ఉండాలన్నారు. మంగళగిరి చీరలకు మంత్రి లోకేశ్ బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని చంద్రబాబు కితాబిచ్చారు. బడ్జెట్ వేళ మహిళా ఎమ్మెల్యేలు అంతా ఒకే రకమైన చీరలతో సభకు రావటం ఐక్యతకు నిదర్శనంగా బాగుందని చంద్రబాబు మెచ్చుకున్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

”రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే. రాయలసీమ హార్టికల్చర్ హబ్ కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలు అంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కప్పుడు పశువులకు నీరు కూడా అనంతపురంలో దొరికేది కాదు. రైల్లో పశుగ్రాసం, నీళ్లు రాయలసీమకు తరలించిన సందర్భాలు ఉన్నాయి. 2014-19 మధ్య కూడా రెయిన్ గన్స్ తో పంటలను కాపాడాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడే హంద్రీనీవాను సీరియస్ గా తీసుకున్నాం. ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం. దేశంలోనే ఉత్తమమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయి. అక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది” అని చంద్రబాబు అన్నారు.

Also Read: బిల్ గేట్స్‌ను 3సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే, జూబ్లీహిల్స్ తరహాలోనే అమరావతి కూడా- సీఎం చంద్రబాబు