Tirupati Rural ZPTC Result: తిరుపతి రూరల్ జెడ్పీటీసీ పోరులో వీడిన ఉత్కంఠ.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సంచలన విజయం.. టీడీపీకి మిశ్రమ ఫలితం!

తిరుపతి (Tirupati Rural ZPTC Result)రూరల్ జెడ్పీటీసీ పోరులో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 602 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Ycp candidate chevireddy harshith reddy wins tirupati rural zptc election

Tirupati Rural ZPTC Result: తిరుపతి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి (Tirupati Rural ZPTC Result)రూరల్ జెడ్పీటీసీ స్థాన ఫలితం ఎట్టకేలకు వెలువడింది. పొలిటికల్ హీట్ పెంచిన ఈ హోరాహోరీ పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 602 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించి అధికారుల నుంచి డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన చిన్న కుమారుడైన హర్షిత్ రెడ్డిని బరిలోకి దింపి గెలిపించుకోవడంతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. రాబోయే 2 రోజులు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

చంద్రగిరి నియోజకవర్గంలో మిశ్రమ ఫలితాలు.. టీడీపీ, వైసీపీలకు మూడేసి స్థానాలు:

కీలకమైన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలకు ఓటర్లు మిశ్రమ ఫలితాలను అందించారు. చెరో మూడు స్థానాల్లో విజయం సాధించి ఇరు పార్టీలు సమవుజ్జీలుగా నిలిచాయి. చంద్రగిరి, పాకాల, రామచంద్రపురం జెడ్పీటీసీ స్థానాలను తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకోగా, మిగిలిన తిరుపతి రూరల్, చిన్నగొట్టికల్లు, యర్రావారిపాలెం జెడ్పీ స్థానాలను వైసీపీ దక్కించుకుని తమ పట్టును నిలుపుకుంది.

సంబరాల్లో మునిగిన వైసీపీ శ్రేణులు.. హర్షిత్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ:

తిరుపతి రూరల్ పరిధిలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం సాధించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాల్లో మునిగితేలారు. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమించిన చెవిరెడ్డి కుటుంబానికి ఈ విజయం పెద్ద ఊరటనిచ్చింది. హర్షిత్ రెడ్డి విజయం పట్ల పలువురు ముఖ్య నాయకులు, అనుచరులు ఆయనకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.