Janasena : వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. క్యాడర్‌లో ఫుల్ జోష్!

Janasena Pawan Kalyan : లోకల్ బాడీ పోల్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్న జనసేన అధినాయకత్వం.. ఓ వైపు కూటమిలో సీట్ల షేరింగ్‌పై పట్టుబడుతూనే.. ఇంకోవైపు ఫీల్డ్ ఆపరేషన్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు గ్రౌండ్‌ను గట్టిగానే ప్రిపేర్ చేస్తుంది.

Janasena Pawan Kalyan

Janasena Pawan Kalyan : రెడీ టు లోకల్ ఫైట్. గ్రౌండ్‌ లెవల్‌లో బలపడాలి. స్థానిక పోరులో సత్తా చాటి తీరాలి. ఇదే ఎజెండాతో ముందుకెళ్తోంది జనసేన. లోకల్ బాడీ పోల్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్న జనసేన అధినాయకత్వం.. ఓ వైపు కూటమిలో సీట్ల షేరింగ్‌పై పట్టుబడుతూనే.. ఇంకోవైపు ఫీల్డ్ ఆపరేషన్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు గ్రౌండ్‌ను గట్టిగానే ప్రిపేర్ చేస్తుంది.

Also Read : Kollu Ravindra: ఆధార్ కార్డు ఉంటే చాలు.. మద్యం షాపు లైసెన్స్ మీదే.. అక్టోబర్ 5న డ్రా.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన

ఒకపక్క పార్టీ నిర్మాణం చేస్తూ, ఇంకోవైపు గెలవగలిగే స్థానాలపై ఫోకస్ పెడుతూ.. మరోవైపు చేరికల జోరు పెంచుతోంది. అధినేత జాయినింగ్స్‌పై ఫోకస్ పెడితే.. నేతలంతా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై స్టడీ చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయారు. లోకల్ బాడీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని కాస్త ప్రభావం చూపగలిగే లీడర్లను చేర్చుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు పట్టున్న కార్పొరేషన్, పురపాలక సంస్థలపై జనసేన ఫోకస్ పెట్టింది. ఆయా చోట్ల పార్టీ బలమెంత.? వైసీపీలో ఉన్న లీడర్లను జాయిన్ చేసుకుంటే తమకు ఎంతవరకు కలిసి వస్తుందనే దానిపై ఆరా తీస్తూ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యే స్థాయి లీడర్లకు కండువా కప్పేశారు జనసేన అధినేత పవన్.

లోకల్‌ పోరుపై కూటమిలో టీడీపీ కంటే ముందే జనసేన అలర్ట్ అయింది. కానీ జనసేన కంటే ముందే టీడీపీ చేరికల ఎపిసోడ్‌ను స్టార్ట్ చేసింది. ఉత్తరాంధ్రలో కీలక నాయకుడిగా ఉన్న మజ్జి శ్రీనివాస్‌ను చేర్చుకుని వైసీపీకి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు పవన్‌ తమవంతు అంటూ వైసీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు పవన్. ఏపీలో మూడో అతిపెద్ద పార్టీగా బలపడాలని జనసేన ప్రణాళికలు రచిస్తోంది. నవ్యాంధ్రలో స్ట్రాంగ్‌ ఫోర్స్‌గా ఎమెర్జ్ కావాలని పట్టుదలతో ఉంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న లీడర్లను.. నాన్‌ కాంట్రవర్సీ నేతలుగా పేరున్న వారిని జనసేన చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు.

ఏయే కార్పొరేషన్లలో, ఏయే నియోజకవర్గాల్లో తమకు క్యాడర్, లీడర్లు బలంగా లేరో..అక్కడ ఆకర్ష్‌ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేనలోకి వలసల జోరు పెరిగింది. ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా వైసీపీ నుంచి నేతలు జనసేనలోకి వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కొందరు నేతలు జనసేన కండువాలు కప్పుకుంటున్నారు. మరికొందరు సంప్రదింపుల దశలో ఉన్నారు.

ఇప్పటికే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, యనమల కృష్ణుడు, నవీన్ నిచ్చల్ వంటి ఎమ్మెల్యే స్థాయి నేతలు పార్టీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు జిల్లా స్థాయి నేతలు జనసేన గూటికి చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పరుపుల సుబ్బారావు, తుని సెగ్మెంట్ నుంచి యనమల కృష్ణుడు, హిందూపురం నుంచి నవీన్ నిచ్చల్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పి..పవన్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరిపోయారు.

రెండు, మూడు నెలల క్రితమే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన జనసేన చేరికల కమిటీ..సరిగ్గా స్థానిక ఎన్నికలకు నేతల ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తుంది. అనారోగ్య కారణంగా గత రెండు నెలలుగా పవన్ కల్యాణ్ అందుబాటులోకి లేకపోవడంతో ఆలస్యమైన చేరికలు పవన్ విధుల్లోకి రావడంతో మొదలయ్యాయి. దీంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ చేరికలకు గేట్లు తెరిచింది జనసేన.

అయితే పార్టీలోకి చేర్చుకునే ముందు..కూటమిలోని టీడీపీ, బీజేపీకి అనుకూలమైన వారికే గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు పవన్. కాంట్రవర్సీ లీడర్‌గా పేరున్నా.. టీడీపీ, బీజేపీతో విభేదాలున్న లీడర్లను తీసుకుంటే కూటమి పార్టీల మధ్య క్లాషెస్ వచ్చే పరిస్థితి ఉందని ముందే అలర్ట్ అవుతోంది. ఒంగోలులో బాలినేని శ్రీనివాస్‌, దామచర్ల జనార్ధన్‌ మధ్య వైరం నడుస్తుండటంతో.. అలాంటి సీన్ ఎక్కడా రిపీట్‌ కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది జనసేన.

అయితే స్థానిక ఎన్నికలనే దృష్టిలో పెట్టుకోకుండా భవిష్యత్‌ అవసరాలు, రాజకీయాల కోసం చేరికలకు ఆమోదం తెలుపుతున్నారు పవన్. గ్రామ మండల, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి నేతలతో పాటు రాష్ట్రస్థాయిలో కొందరు సీనియర్లు కూడా పార్టీకి అవసరమని భావిస్తున్నారట పవన్. ప్రస్తుతం జనసేనకి 21 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పోటీకి ప్లాన్ చేస్తుండటంతో.. ఇప్పుడు చేర్చుకునేవారిలో ఎమ్మెల్యే స్థాయి నేతలే ఉండేలా చూసుకుంటున్నారు.

నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఎక్కడెక్కడ జనసేన పోటీ చేయాలనుకుంటుందో అక్కడ ఎమ్మెల్యే స్థాయి నేతలకు గాలం వేస్తున్నారట. ఇప్పటికే బాలినేని, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య వంటి వారిని ఈ తరహాలోనే చేర్చుకున్నారు పవన్. ఇప్పుడు చేర్చుకునే వారిని కూడా అలానే ముందస్తు వ్యూహంతో కండువా కప్పుతున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికల ముందు చేరికలకు గేట్లు ఎత్తి..పబ్లిక్‌ అటెన్షన్ గ్రాబ్‌ చేసే ప్లాన్ చేస్తున్నారు పవన్. ఇంకెవరెవరు జనసేనలో చేరబోతున్నారో చూడాలి మరి.