×
Ad

Dwarampudi Chandrasekhar : పవన్ ప్యాకేజీ సొమ్ములు విదేశాలకు ఎలా వెళ్ళాయో బయటకు రావడం ఖాయం: ద్వారంపూడి చంద్రశేఖర్

పవన్ కళ్యాణ్ బీజేపీని కాదని బయటకు రమ్మనండీ అంటూ సవాల్ విసిరారు.పవన్ ప్యాకేజీ సొమ్ములు ఏ రూట్ ద్వారా విదేశాలకు వెళ్ళాయో బయటకు రావడం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు.

  • Published On : October 7, 2023 / 02:02 PM IST

Dwarampudi Chandrasekhar

Dwarampudi Chandrasekhar : పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీని కాదని బయటకు రమ్మనండీ అంటూ సవాల్ విసిరారు.పవన్ ప్యాకేజీ సొమ్ములు ఏ రూట్ ద్వారా విదేశాలకు వెళ్ళాయో బయటకు రావడం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు. నాకు తెలిసి రూ.1400 కోట్ల ప్యాకేజీ సొమ్ములు హవాల ద్వారా దేశం దాటింది అంటూ అనుమానాలు వ్యక్తంచేశారు. ఆ సొమ్ములు దుబాయ్ కి వెళ్ళాయా? లేక రష్యాకు వెళ్ళాయా..?సింహపూర్ కు వెళ్ళాయా..? అనేది తెలుస్తుందన్నారు.పవన్ కు దమ్ముంటే నా మీద గ్లాస్ గుర్తును పోటీకి పెట్టాలి అంటూ సవాల్ విసిరారు.

ఇదే సమయంలో నారా లోకేశ్ పై కూడా ద్వారంపూడి విరుచుకుపడ్డారు. వ్యవస్థలను మానేజ్ చేసి తన తండ్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ లోకేశ్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. వ్యవస్ధలను మేనేజ్ చేసేది మీ నాన్ననే లోకేష్ అంటూ విమర్శించారు.చీకట్లో చిదంబరం కలిసింది..కాళ్ళు పట్టుకున్నది చంద్రబాబే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా పవన్ కల్యాణ్, ద్వారంపూడి మధ్య గతంలో కూడా ఘాటు విమర్శలు చేసుకున్నారు. వారాహి యాత్రలో వపన్ ద్వారంపూడిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయన కూడా పవన్ పై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇలా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు కొనసాగుుతున్నాయి.