Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
ఎమ్మెల్యేకు యాంజియోగ్రామ్ చేసి, స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
- bheemraj
- Published On : June 10, 2023 / 05:31 PM IST
Parthasarathy
Parthasarathy Heart Attack : కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ కానూరులోని టాప్ స్టార్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎమ్మెల్యే పార్థసారథికి యాంజియోగ్రామ్ చేసి, స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకుని వైసీపీ నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
