13day Old Baby Passport : 13 రోజుల పసికందుకు పాస్‌పోర్ట్.. ఆంధ్రప్రదేశ్ చిన్నారి సరికొత్త రికార్డు! ఆ చిన్నారి కథ ఇదే..

13day Old Baby Passport : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇచ్చాపురానికి చెందిన ఓ 13ఏళ్ల చిన్నారి అరుదైన రికార్డు సృష్టించింది.

13day Old Baby Passport

13day Old Baby Passport : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పసికందు అరుదైన రికార్డు సృష్టించింది. ఇచ్చాపురానికి చెందిన వజ్రపు అగస్య ప్రిన్సీ అత్యంత చిన్న వయసులో పాస్‌పోర్ట్ పొందిన చిన్నారిగా గుర్తింపు పొందింది. గతంలో ఉన్న రికార్డును అధిగమించి అంతర్జాతీయ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకుంది. పుట్టిన రెండు వారాలు కూడా పూర్తికాకముందే ఈ చిన్నారి సాధించిన ఘనత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Also Read : AP Rains : ఏపీకి రెయిన్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. భీకర గాలులు

ఆంధ్రప్రదేశ్‌లోని ఇచ్చాపురానికి చెందిన వజ్రపు అగస్య ప్రిన్సీ ఈ అరుదైన రికార్డును సాధించింది. కేవలం 13 రోజుల వయసులోనే ఆమెకు పాస్‌పోర్ట్ జారీ అయింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా నమోదు చేసింది. 2026 జూన్ 12న ఈ రికార్డు సాధించినట్లు సంస్థ వెల్లడించింది.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం దాసన్నపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వజ్రపు వెంకటేష్ రెండో కుమారుడైన వజ్రపు ఆశిష్, గీతామాధురి దంపతుల కుమార్తె అగస్య ప్రిన్సీ అరుదైన రికార్డును సాధించింది. ఈ చిన్నారి మే 30వ తేదీన అమ్మమ్మ ఊరైన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించింది. అయితే, ఆశిష్ ఉద్యోగరిత్యా భార్యతో కలిసి లండన్‌లో ఉంటున్నారు. ఈ చిన్నారికి పాస్‌పోర్టు చాలా ముఖ్యం కావడంతో.. ముందుగానే జూన్ 1న డేట్ ఆఫ్ బర్త్ డే సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆ వెంటనే జూన్ 2న బాల ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా.. జూన్ 4న ఆధార్ కార్డు కూడా వచ్చింది. ఆధార్ కార్డుతో జూన్ 6న పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న పాస్‌పోర్టు మంజూరైంది. కేవలం 13 రోజుల్లోనే ఈ చిన్నారికి పాస్‌పోర్ట్ వచ్చేసింది.

అత్యంత చిన్న వయసులో పాస్‌పోర్ట్ పొందిన చిన్నారిగా ఇంతకుముందు.. 2024లో తమిళనాడుకు చెందిన పీ. తుషా సరోజిని రెండు నెలల 21 రోజుల వయసులో పాస్‌పోర్ట్ పొందింది. కొద్ది నెలల క్రితం 19రోజుల వయసులోనే చిన్నారికి పాస్‌పోర్టు వచ్చిన రికార్డు ఉండేది. ప్రస్తుతం అగస్య ప్రిన్సీ కేవలం 13 రోజులకే పాస్‌పోర్ట్ పొందడంతో ఆ రికార్డు బద్దలైంది. దీంతో ఆమె పేరును ‘యంగెస్ట్ పాస్‌పోర్ట్ హోల్డర్’గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు.

ఇచ్చాపురానికి చెందిన ఈ చిన్నారి సాధించిన ఘనత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. చిన్నారి వయసు కేవలం రెండు వారాల లోపే ఉన్నప్పటికీ.. ఆమె పేరు అంతర్జాతీయ రికార్డు జాబితాలో చోటు సంపాదించింది. ప్రస్తుతం ఈ చిన్నారి వయస్సు మూడున్నర నెలలు.