YS Jagan participated in Ugadi celebrations : ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు.. సాంప్రదాయ పంచకట్టులో.. వీడియో వైరల్

YS Jagan participated in Ugadi celebrations : తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు.

YS Jagan participated in Ugadi celebrations

  • తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
  • పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు
  • పంచకట్టులో ఉగాది వేడుకల్లో జగన్

YS Jagan participated in Ugadi celebrations : తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ సాంప్రదాయ పంచకట్టులో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పిడపర్తి భాస్కర సుబ్రమణ్వేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాగంను జగన్ దంపతులు శ్రద్ధగా విన్నారు. ఈ వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులతోపాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు వానలు.. ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే చాన్స్..