YS Jagan : స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు కీలక సూచనలు చేసిన వైఎస్ జగన్.. అలాచేస్తే ఇబ్బందులు తప్పవ్..

YS Jagan : ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.

YS Jagan

YS Jagan : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.

Also Read : Nara lokesh : మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన..

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే వైసీపీ కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైసీపీ జెండా ఎగరాలి.. ప్రభుత్వం వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే వాళ్లే మీకు జనరల్ ఎన్నికల్లో బలగంగా నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని సీరియస్ గా తీసుకుంటా అంటూ నేతలకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఏకగ్రీవాలు జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ ఛార్జి ఫెయిల్యూర్ గానే భావిస్తాను. ప్రజల్లో నిరంతరం ఎవరు ఉన్నారు..? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో, ఇప్పటికే మీకందరికీ అవగాహనకు వచ్చి ఉంటుంది. అలాంటి వారిని గుర్తించి, పోటీకి సన్నద్ధం చేయండి అంటూ నేతలకు జగన్ సూచనలు చేశారు.

కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ‘వెన్ను పోటుకు రెండేళ్లు’’ పేరిట వైఎస్ఆర్ సీపీ బుక్ లైట్ విడుదల చేసింది. ఈ బుక్‌లెట్ ను ప్రతి గ్రామానికి చేర్చాలని, తద్వారా ప్రజలను జాగృత పర్చాలని వైఎస్ జగన్ సూచించారు. కమిటీ సభ్యులు అందరికీ కూడా ‘వెన్నుపోటు రెండేళ్లు’ కాపీలు అందేలా చూడండి. ఈ బుక్‌లెట్‌ ప్రతీ ఇంటికీ చేరేలా చూడాలి. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలి. చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లపై ప్రజలు తిరగబడతారని జగన్ తెలిపారు.