YCP digital book
YCP digital book : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను ప్రారంభించారు. బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేశారు. కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసని, వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఈ సందర్భంగా జగన్ హెచ్చరించారు.
Also Read: YS Jagan : ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్.. ప్రతివాదులకు నోటీసులు..
రెడ్ బుక్ పేరుతో వైసీపీ కేడర్ ను వేధిస్తున్నారని, వీరికి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో వేధింపులు, అన్యాయానికి గురవుతున్న వారు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్ తో పాటుగా ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కేటాయించడం జరిగిందని అన్నారు. ఇక నుంచి పార్టీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడుతున్నా దీని ద్వారా పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని జగన్ సూచించారు. కార్యకర్తలను వేధించిన వారిని వదిలిపెట్టేది లేదని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్ జగన్ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను ఇక నుంచి పోరుబాటలో పాల్గొంటానని వెల్లడించారు. పార్టీలోని అన్ని కమిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్ నిర్దేశించినట్లు తెలిసింది.
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం.#YSJagan#AndhraPradesh pic.twitter.com/8NA8DKqiRC
— YSR Congress Party (@YSRCParty) September 24, 2025