Godavari Districts: ఒక్కో రూమ్ లక్ష రూపాయలు..! 3 నెలల ముందే అన్నీ బుక్.. గోదావరి జిల్లాల్లోని హోటల్స్ కి హౌస్ ఫుల్ బోర్డులు

లాడ్జ్ లు, హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్ కావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Godavari Districts: ఒక్కో రూమ్ లక్ష రూపాయలు..! 3 నెలల ముందే అన్నీ బుక్.. గోదావరి జిల్లాల్లోని హోటల్స్ కి హౌస్ ఫుల్ బోర్డులు

Godavari Districts Representative Image (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 9:14 PM IST
  • గోదావరి జిల్లాల్లోని హోటల్స్ అన్నీ బుక్
  • 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల ప్యాకేజీలు
  • అతిథుల కోసం అన్ని సౌకర్యాలు
  • స్థానిక సంస్కృతి, సంప్రదాయం తెలిపేలా ఏర్పాట్లు

Godavari Districts: సంక్రాంతి సంబరాలకు ఉభయ గోదావరి జిల్లాలు సిద్ధమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం హోటల్స్, ఫార్మ్ హౌస్, గెస్ట్ హౌస్, కళ్యాణ మండపాల్లోని గదులన్నీ మూడు నెలల క్రితమే బుక్ అయిపోయాయి. ఇక 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల ప్యాకేజీల రూపంలో పందెం రాయుళ్లు బుక్ చేసుకోవడంతో గోదావరి జిల్లాల్లోని హోటల్స్ కి హౌస్ ఫుల్ బోర్డులు కనపడుతున్నాయి. సంక్రాంతి సమయంలో లాడ్జ్ లు, హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్ కావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చూపరులను ఆకట్టుకునే విధంగా డెకరేషన్..

భీమవరం, పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి సందడి వాతావరణం నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో ఈ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ని హోటళ్లు, గెస్ట్ హౌస్ లు, కల్యాణ మండపాల్లోని గదులు.. అన్నీ బుక్ అయిపోయాయి. ముందు జాగ్రత్తగా గదులు బుక్ చేసుకున్నారు. మూడు నెలల క్రితమే రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం హోటల్స్ యాజమాన్యాలు.. గదలను చక్కగా సిద్ధం చేశాయి. చూపరులను ఆకట్టుకునే విధంగా డెకరేట్ చేశారు.

స్థానిక వాతావరణం, సంస్కృతి, సంప్రదాయాలు అతిథులకు తెలిసేలా ఏర్పాట్లు చేశారు. స్థాయికి తగ్గట్లుగా హోటల్స్ యాజమాన్యాలు ప్యాకేజీలు సిద్ధం చేశాయి. హోటల్ స్థాయిని బట్టి మూడు రోజుల ప్యాకేజీ, వారం రోజుల ప్యాకేజీలు రెడీ చేశాయి. కొన్ని హోటల్స్ లో రోజుకు లక్ష రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. మరికొన్నింటిలో మూడు రోజులకు లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.

ఎవరికైనా అత్యవసరమై రూమ్ కావాలంటే దొరకని పరిస్థితి ఉంది. ఎందుకంటే మూడు నెలల క్రితమే రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి. వచ్చే అతిథులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాయి హోటల్స్ యాజమాన్యాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లోని హోటల్స్, గెస్ట్ హౌస్ లు, వెడ్డింగ్ హాల్స్ లోని గదులన్నీ పూర్తిగా బుక్ అయ్యాయి.

Also Read: ఈసారి పవన్ వార్నింగ్‌ అందరికీ గుచ్చుకున్నట్లేనా.? పవన్ నోట పదేపదే అదే మాట