Ys Sharmila Daughter Marriage : వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి ఫిక్స్.. కాబోయే అల్లుడిని పరిచయం చేసిన షర్మిల

Ys Sharmila Daughter Marriage : బ్రదర్ అనిల్ కుమార్ - వైఎస్ షర్మిల దంపతుల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చమైంది.

Ys Sharmila Daughter Marriage

Ys Sharmila Daughter Marriage : దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెండ్లి సందడి నెలకొంది. బ్రదర్ అనిల్ కుమార్ – షర్మిల దంపతుల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం త్వరలోనే జరగబోతోంది. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు.. తన కుమార్తెతో పాటు కాబోయే అల్లుడి ఫొటోను కూడా షర్మిల షేర్ చేశారు. ఈ శుభవార్తను రాష్ట్ర ప్రజలతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు.

Also Read : Singer Jhansi : చీర‌క‌ట్టులో బిగ్‌ బాస్ సీజ‌న్ 10 కంటెస్టెంట్‌.. సింగ‌ర్ ఝాన్సీ ఫోటోలు వైర‌ల్‌..

షర్మిల ట్వీట్ ప్రకారం.. మా కుమార్తె వై.ఎస్. అంజలి రెడ్డికి సోమల సుబ్బారెడ్డి- సోమల పద్మారెడ్డి దంపతుల కుమారుడైన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో వివాహం నిశ్చయమైంది. ఈ శుభవార్తను తెలియజేయడానికి నా భర్త అనిల్ కుమార్, నేను దేవునికి ఎంతో కృతజ్ఞతతో సంతోషిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులు. వారు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందినవారు. మా స్నేహితులు, శ్రేయోభిలాషులందరి ప్రార్థనలు, ఆశీస్సులు కోరుకుంటున్నాము. అని షర్మిల పేర్కొన్నారు.