Ys Viveka Case: వివేకా హత్య కేసు.. విచారణ రిపోర్ట్ నిందితులకు అందజేత
ఎంపీ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన నిందితులు CBI కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
- Naveen
- Published On : March 10, 2026 / 04:23 PM IST
Ys Viveka Representative Image (Image Credit To Original Source)
Ys Viveka Case: ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్య కేసులోని CBI ఇన్వెస్ట్ గేషన్ రిపోర్ట్ తో పాటు గతంలో విచారణ చేసిన సిట్ రిపోర్ట్, కేసు రికార్డ్స్ ను నిందితులకు అప్పగించింది CBI. కేసుకి సంబంధించిన 13 లక్షల ఫైల్స్ ను ఇండెక్స్ రూపంలో పొందుపరిచి నిందితులకు అందజేసింది. సీబీఐ ఇచ్చిన 13 లక్షల ఫైల్స్ లో టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా చూస్తామని కోర్టుకి తెలిపింది CBI. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ కేసులో అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ ను CBI విచారించింది. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి విచారణ రిపోర్ట్ ను కోర్టుకి అందజేసింది CBI. ఎంపీ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన నిందితులు CBI కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
