YS Sharmila commented Jagan
YS Sharmila Comments On Jagan : ఏపీ సీఎం జగన్ పై వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన అన్నకు చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశానని పేర్కొన్నారు. తన శక్తికి మించి అన్నకు సాయం చేశానని తెలిపారు.
తాను సాయం చేశానని తిరిగి వారు సాయం చేయాలని కోరుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతితో తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏపీలో అవినీతి గురించి అక్కడి ప్రతిపక్షం మాట్లాడాలన్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.