Sai Krishna Case: సాయికృష్ణ కుటుంబానికి అండగా వైఎస్సార్‌సీపీ పార్టీ.. రూ. 20 లక్షల ఆర్థిక సాయం
సాయికృష్ణ(Sai Krishna Case) తల్లిని ఓదార్చి పార్టీ తరఫున రూ. 20 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆమెకు అందజేశారు.
- V Santhosh Kumar
- Published on- July 6, 2026 / 05:41 PM IST
YSRCP provides 20 lakh financial assistance to Gade Jayakrishna family
- సాయికృష్ణ తల్లికి పరామర్శ.
- వైసీపీ ఆర్థిక సహాయం.
- రూ. 20 లక్షల చెక్.
Sai Krishna Case: తాడేపల్లిలో ఇటీవల మరణించిన సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలు పరామర్శించి, తమ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం తరఫున భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా, సాయికృష్ణ (Sai Krishna Case)తల్లిని వైసీపీకి చెందిన ముఖ్య కాపు నాయకులు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, అడపా శేషు తదితరులు ప్రత్యక్షంగా కలిశారు.
Dhanush Political Entry: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో? అధికారిక జెండా ఆవిష్కరణ
ఆమెను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అనంతరం పార్టీ తరఫున మంజూరైన రూ. 20 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆమెకు అందజేశారు. వైసీపీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటుందని, ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ తరఫున పూర్తి మద్దతు లభిస్తుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సాయం సాయికృష్ణ కుటుంబానికి కొంతవరకు ఊరటనిస్తుందని, వారి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
