Pulivendula: జగన్‌కు ఎందుకు ఓటు వేయాలి.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? దస్తగిరి ఆవేదన, ఆగ్రహం

పులివెందులలో(Pulivendula) వైఎస్ జగన్ ర్యాలీ వద్ద పాలనపై ప్రశ్నించేందుకు యత్నించిన దస్తగిరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

Ysrcp workers attack dastagiri at ys jagan rally in pulivendula

Pulivendula: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ర్యాలీ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి, జగన్ ర్యాలీ వద్దకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, ఆయనపై వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకుపడి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఊహించని పరిణామంతో పులివెందుల(Pulivendula) వీధుల్లో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

Green Tankers: హైదరాబాద్ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్.. కేవలం రూ.400 కే ట్యాంకర్.. ఈ నంబర్ కి డయల్ చేయండి!

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? దాడిపై విరుచుకుపడ్డ దస్తగిరి:

ఈ ఘోర ఘటనపై దస్తగిరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనంతా అరాచకాలతోనే సాగిందని విమర్శించిన ఆయన, “జగన్‌కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని అడిగినందుకే నాపై దాడులకు దిగారు, ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే మరియు ప్రశ్నించే హక్కు లేదా?” అని నిలదీశారు. అభిప్రాయం చెప్పినంత మాత్రాన భౌతిక దాడులు చేయడం ముమ్మాటికీ అరాచకమని దుయ్యబట్టారు.