Ap Elections 2024 Results TDP ranks have started the celebrations
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ(టీడీపీ) కూటమి హవా కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల సమయానికి వందకుపై సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ 110 స్థానాల్లో, జనసేన 14 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అధికార వైసీపీ బాగా వెనుకబడి పోయింది. కేవలం 27 స్థానాల్లోనే లీడింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ సింగిల్‌గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పయనిస్తోంది.
సంబరాలు మొదలు..
110 కి పైగా స్థానాల్లో తెలుగు దేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలను మొదలుపెట్టాయి. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, భారీగా మెజార్టీని సొంతం చేసుకుంటామని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.