31న చంద్రబాబు, పవన్ కీలక సమావేశం..

విదేశీ పర్యటన ముగించుకుని ఇవాళే హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు.

Ap Elections 2024 : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ నెల 31న సమావేశం కానున్నారు. పోలింగ్ జరిగిన తీరుతో పాటు అనంతరం జరిగిన పరిణామాలపైనా సమీక్ష నిర్వహించబోతున్నారు. బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. విదేశీ పర్యటన ముగించుకుని ఇవాళే హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు. రేపు రాత్రి అమరావతికి వెళ్లనున్నారు. 31న చంద్రబాబు, పవన్ ల సమావేశం ఉంటుంది.

ఏపీలో మే 13న పోలింగ్ జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కలిసి చర్చలు జరిపింది లేదు. తాజాగా వీ రిద్దరూ సమావేశం కావాలని నిర్ణయించారు. పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఇరువురూ చర్చించనున్నారని తెలుస్తోంది. ముందుగా చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారని, ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలవనున్నారని సమాచారం. ఎన్నికల ట్రెండ్, పోలింగ్ సరళి, పోలింగ్ అనంతరం జరిగిన హింస, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై చంద్రబాబు, పవన్ డిస్కస్ చేసే అవకాశం ఉంది.

Also Read : ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

 

ట్రెండింగ్ వార్తలు