Araku Lok Sabha Constituency : వైసీపీ కంచుకోటలో హైవోల్టేజ్ ఫైట్.. ఈసారి అందలమెవరికో?
ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇంతవరకు ఒక్కసారి విజయం సాధించని టీడీపీ... ఈ సారి కూటమిగా మూడుపార్టీల మద్దుతుతో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోగా, అరకులో వైసీపీ బ్రాండ్ చెక్కుచెదరలేదని... ఫ్యాన్ స్పీడ్‌ను ఎవరూ ఆపలేరని ధీమాగా ఉంది అధికార పార్టీ
- Naveen
- Published On : April 16, 2024 / 09:56 PM IST
Araku Lok Sabha Race Gurralu
Araku Lok Sabha Constituency : అరకు వాతావరణం ఎంత కూలో.. అక్కడి రాజకీయం అంత హాట్. అరకు అంటే అందమైన ఏరియానే కాదు.. అదో ఎమోషన్… ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్ జోన్‌గా చెప్పే అరకు పార్లమెంట్.. ఇప్పుడు రాజకీయాలకు వార్ జోన్.
ఏపీలో ఏకైక ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన అరకులో ఈ ఎన్నికల్లో పోటీ ఎలా ఉంది? సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టిన వైసీపీ కొత్త అభ్యర్థిని ఎందుకు తెరపైకి తెచ్చింది? మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బీజేపీ టికెట్ ఎలా దక్కింది? వైరి పక్షాలు కూడా ఊహకందని రీతిలో వేస్తున్న ఎత్తులు ఎలాంటి ఫలితాలు ఇవ్వనున్నాయి? అరకులో కనిపించే సీనేంటి?
Also Read : పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఈసారి అక్కడ గెలుపు ఎవరిదో?
