Dussehra 2026 Date : ఈసారి దసరా పండుగ 20న లేక 21వ తేదీనా..? క్లారిటీ వచ్చేసింది.. పూజకు, రావణ దహనానికి ముహూర్తం ఇదే..
Dussehra 2026 Date and Time : తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటారు. దేవి నవరాత్రి ఉత్సవాల చివరి రోజు సాయంత్రం దసరా పండుగను జరుపుకుంటారు.
- Harish Thanniru
- Updated on- October 14, 2026 / 03:26 PM IST
Dussehra 2026 Date
Dussehra 2026 Date and Time : తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటారు. దేవి నవరాత్రి ఉత్సవాల చివరి రోజు సాయంత్రం దసరా పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షం దశమి తిథినాడు ప్రతియేటా దసరా పండుగ వస్తుంది. అదే రోజున విజయానికి శుభప్రదమైన సమయమైన విజయ ముహూర్తంలో ఆయుధ పూజ నిర్వహిస్తారు. సాయంత్రం సమయంలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇదంతా బాగానే ఉన్నా.. అసలు దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి..? అక్టోబర్ 20వ తేదీనా? 21వ తేదీనా అనే సందేహం చాలా మందిలో వ్యక్తమవుతోంది. కొందరు ఒక తేదీ చెబుతుండగా.. మరికొందరు మరో తేదీ చెబుతున్నారు. అయితే, దసరా పండుగ ఎప్పుడనే విషయంపై స్పష్టమైన క్లారిటీ వచ్చింది.
వేద పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది దసరాకు సంబంధించిన ఆశ్వయుజ శుక్ల దశమి తిథి అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం 12.50గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 21వ తేదీన మధ్యాహ్నం 2.11గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయంలో ఉండే తిథిని పరిగణలోకి తీసుకుంటే దశమ తిథి అక్టోబర్ 21న బుధవారం దసరా పండుగ వస్తుంది. అయితే, ఇక్కడ మరో విషయం ఏమిటంటే? దసరా నిర్ణయంలో దశమి తిథితోపాటు నక్షత్రం, విజయ మహూర్తం, ప్రదోష కాలం వంటి అంశాలనూ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం దశమి తిథి ప్రారంభమవుతుంది. అదే సమయంలో శ్రవణ నక్షత్రం, ప్రదోష కాలం, విజయ మహూర్తం కూడా కలిసి వస్తుండటంతో ఈ సంవత్సరం దసరా పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకుంటారు. విద్యారంభం, ఆయుధపూజ, శమీపూజ, కొత్త కార్యాల ప్రారంభానికి శుభదినంగా భావిస్తారు.
ముహూర్తాలు, సమయాలు..
- విజయ్ ముహూర్తం : మధ్యాహ్నం 01:59 నుండి 02:45 వరకు (లేదా 02:00 నుండి 02:45 PM వరకు)
- అపరాహ్ణ పూజ సమయం : మధ్యాహ్నం 01:14 నుండి 03:30 వరకు
- బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:44 నుండి 05:34 వరకు
- దశమి తిథి ప్రారంభం: అక్టోబర్ 20, మధ్యాహ్నం 12:50 నుండి
- దశమి తిథి ముగింపు: అక్టోబర్ 21, మధ్యాహ్నం 02:11 వరకు
- రావణ దహన కార్యక్రమానికి అనువైన సమయం ప్రదోష కాల సమయంలో సాయంత్రం 06:02 నుండి.
