×
Ad

Wealth Lamp: ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేకపోతున్నారా? ఈ దీపం వెలిగిస్తే తిరుగులేదంతే..!

ఒక్కోసారి సంతానంలో కూడా ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ చూపిస్తుంటాం. అటువంటప్పుడు కూడా ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని స్థితి చివరి దశలో వస్తుంది.

Wealth Lamp: ఒక్కోసారి ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ.. దాన్ని అనుభవించలేని పరిస్థితి ఉంటుంది. బంగ్లాలు ఉన్నా.. రెంట్ హౌస్ లో ఉండే పరిస్థితి. కార్లు ఉన్నా అందులో తిరగలేరు. అష్ట ఐశ్వర్యాలు ఉన్నా ఏదో ఒక కారణంతో వాటిని అనుభవించలేని స్థితి ఏర్పడుతుంటుంది. అవసరానికి మనుషులు సాయానికి రారు. ఐశ్వర్యం ఉన్న అనుభవించలేని స్థితి ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు చేసుకుంటే మీ ఐశ్వర్యాన్ని మీరు అనుభవించగలుగుతారని పండితులు చెబుతున్నారు.

అందులో ముఖ్యమైన పరిహారం..
* శనివారం ఉడకబెట్టిన శెనగలు కళాకండ్ తో కలిపి ఆలయం ప్రాంగణంలో భక్తులకు పంచి పెట్టాలి. ఇది చాలా శక్తిమంతమైన పరిహారం.

* ఒక్కోసారి సంతానంలో కూడా ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ చూపిస్తుంటాం. అటువంటప్పుడు కూడా ఐశ్వర్యం ఉన్నా అనుభవించలేని స్థితి చివరి దశలో వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతానంలో ఎవరి మీద అయితే తేడా చూపించారో ఆ పిల్లల పేరు మీద అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పసుపు రంగు చీర సమర్పిస్తే ఆ దోషం తొలగిపోతుంది. అప్పుడు ఐశ్వర్యాన్ని అనుభవించగలరు. పిల్లలు కూడా మీకు దగ్గరవుతారు.

* ఏ ఇంట్లో అయితే శివలింగానికి రోజూ బిల్వ దళాలతో పూజ చేస్తే బిల్వాష్టకం చదువుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో వాళ్లు కచ్చితంగా ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు.

* అలాగే వారానికి ఒకసారి ఇంటి సింహ ద్వారానికి వేపాకుల దండ వేలాడదీయాలి. వారానికి ఒకసారి దండ మారుస్తూ ఉండాలి. వేపాడు.. ఇంటికి పట్టిన దిష్టితో మనసుకు పట్టిన దిష్టి కూడా పోగొడుతుంది.

* అమ్మవారి ఆలయంలో శుక్రవారం పూట ధ్వజస్తంభం దగ్గర తమలపాకు మీద మినప పిండితో చేసిన ప్రమిద ఉంచి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి.

* సహజంగా ఆడవాళ్లు బియ్యం పిండి దీపాలకు వెలిగిస్తారు. బియ్యపు పిండి, ఆవు పాలు, బెల్లం తురుము, వీటన్నింటి నీటిలో కలిపి పిండి దీపాలు తయారు చేస్తారు. మినప్పండి దీపాన్ని ఆమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర తమలపాకులు ఉంచి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఈ మినప్పండి దీపం వల్ల అష్టైశ్వర్యాలు ఉంటే వాటిని అనుభవించగలిగే స్థితి వస్తుంది. శుక్రవారం దీపం పెట్టాలి.

* సర్వస్వతి దేవికి ఇష్టమై వస్తువులు దానం చేస్తూ కూడా అష్టైశ్వర్యాలు అనుభవించే యోగ తొందరగా పడుతుంది.