Guru Gochar 2026 : గురు సంచారం 2026.. ఈ రాశుల వారిని ఎవ్వరూ ఆపలేరు.. వద్దన్నా ధనం, రాజ యోగం
Guru Gochar 2026 : గురు సంచారం వల్ల త్వరలోనే పలు రాశులకు అఖండ రాజయోగం.. ధన లాభం కలగబోతుంది.
- Dharani Pilli
- Updated on- May 22, 2026 / 08:50 PM IST
Guru Gochar Jupiter Transit 2026 these zodiac signs get Boundless wealth and Raja Yogam
Guru Gochar 2026 : జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలు కొన్ని రాశుల్లో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలానే దేవ గురువు గురు గ్రహ సంచారం వల్ల నవంబర్ తర్వాత కొన్ని రాశుల వారికి ధన, రాజ యోగాలు కలగనున్నాయి. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్న గురువు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు తనకు ఉచ్ఛ క్షేత్రమైన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు సింహరాశిలో సంచారం చేసి మళ్లీ కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. గురువు ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో సంచరిస్తున్నప్పుడు హంస మహా పురుష యోగం, మహా భాగ్య యోగం కలుగుతుంది. దీని ప్రకారం మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులవారు ధన, రాజయోగాలను అనుభవించబోతున్నారు. ఏ రాశుల వారికి ఏ ప్రయోజనాలు కలుగుతాయంటే..
మేషం:
- గురు సంచారం వల్ల ఈ రాశివారికి హంస మహా పురుష యోగం కలిగింది.
- అందువల్ల ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా వీరి హోదా, స్థాయి పెరిగి రాజపూజ్యాలు కలుగుతాయి.
- ధన, రాజయోగాలు పడతాయి. ఆదాయం బాగా పెరిగి సంపన్నులు అవుతారు.
- ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిథునం:
- గురు సంచారం వల్ల మిథున రాశి వారికి
- ఆదాయం పెరగడమే కానీ తగ్గడం ఉండదు.
- రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.
- పోటీ పరీక్షలు, ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలలో మంచి విజయం సాధిస్తారు.
- వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది.
- నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగం లభిస్తుంది.
- ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.
కర్కాటకం:
- ఈ రాశివారికి హంస మహా పురుష యోగం కలిగింది.
- దీనివల్ల వీరికి రాజపూజ్యాలు కలుగుతాయి.
- రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది.
- ఏ పని ప్రారంభించినా విజయం లభించి.. పట్టిందల్లా బంగారం అవుతుంది.
- ఉద్యోగంలో జీతభత్యాలు, హోదాలు పెరుగుతాయి.
- అనారోగ్య, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
కన్య:
- కన్య రాశివారికి మహా భాగ్య యోగం కలిగి పలు మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.
- కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు.
- ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది.
- ఉద్యోగస్తులకు ఉద్యోగంలో హోదాతోపాటు జీతభత్యాలు పెరుగుతాయి.
తుల:
- వీరికి హంస మహా పురుష యోగం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
- వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది.
- ప్రభుత్వ గుర్తింపుతో పాటు ధన లాభం కలుగుతుంది.
- ఆస్తి వివాదాల్లో వీరికి అనుకూలంగా తీర్పు వస్తుంది.
వృశ్చికం:
- ఈ రాశి వారికి అపర కుబేర యోగం కలుగుతుంది.
- ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం లేదా ప్రేమలో పడటం జరుగుతుంది.
- కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
- ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ప్రమోషన్లు పొందుతారు.
- పలు మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మకరం:
- మకర రాశి వారికి గురు సంచారం వల్ల హంస మహా పురుష యోగం కలుగుతుంది.
- సమాజంలో గుర్తింపు, రాజపూజ్యాలు, రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది.
- ఆకస్మిక ధన లాభం అనేక మార్గాల్లో ఆదాయం.
- పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతానం లేని వారికి బిడ్డలు కలుగుతారు.
మీనం:
- ఈ రాశివారికి అక్టోబర్ 31 వరకు వీరి జాతకం నల్లేరు మీది బండిలా సాగిపోతుంది.
- ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది.
- షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది.
- ఉద్యోగంలో పదోన్నతి, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు
