Chinna Jeeyar Swami: దేశానికి ఇప్పుడు హనుమంతుడి శక్తి చాలా అవసరం- శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
ఆధ్యాత్మికతతో పాటు సాంకేతిక రంగంలోనూ భారత్ ప్రపంచానికి ఆదర్శం కావాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆకాంక్షించారు.
- Naveen
- Published on- May 11, 2026 / 04:53 PM IST
Chinna Jeeyar Swami: హనుమ జయంతి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. మే 11 భారత దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన రోజు అని గుర్తు చేశారు. పోఖ్రాన్ అణు పరీక్షతో భారత్ పౌరుషం ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈరోజే ఆంజనేయస్వామి జన్మదినం రావడం ఎంతో విశిష్టం అని చెప్పారు. ఈ ఏడాది హనుమ జయంతి రెండు రోజులుగా రావడం అద్భుతమైన యోగం అని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు.
విజయకీలాద్రిపై వెలసిన ఆంజనేయస్వామి దేశానికి క్షేమం కలిగించాలని ఆకాంక్షించారు. 27 అడుగుల ఏకశిలా ఆంజనేయస్వామి మహానుభావుడి రూపం అని పేర్కొన్నారు. హనుమంతుడు విజయాన్ని ప్రసాదించేందుకు విజయకీలాద్రిపైకి వచ్చాడని చెప్పారు. దేశానికి ఇప్పుడు హనుమంతుడి శక్తి చాలా అవసరం అని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. దేశాన్ని, ధర్మాన్ని రక్షించే వారితో మనం ఎప్పుడూ ఉండాలన్నారు.
ధర్మాన్ని చీల్చి చెండాడే శక్తులను భగవంతుడు తుదముట్టించాలన్నారు. మనందరినీ భగవంతుడు తన పరికరాలుగా వాడుకోవాలన్నారు. హనుమంతుడి దాసులుగా, రామదాసులుగా, దేశ భక్తులుగా జీవిద్దాం అని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికతతో పాటు సాంకేతిక రంగంలోనూ భారత్ ప్రపంచానికి ఆదర్శం కావాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆకాంక్షించారు. పోఖ్రాన్ ఘటన ప్రతి భారతీయుడికి ప్రేరణ కావాలన్నారు త్రిదండి చిన్నజీయర్ స్వామి.
Also Read: శని సంచారం.. రానున్న 5 నెలలు ఈ 6 రాశుల వారికి గొప్ప యోగం.. ఇక వీరిని ఆపే వారే లేరు.. !
