సంతానం లేట్, భార్యాభర్తల గొడవలా..? ఈ ఒక్క చిన్న మంత్రం 108 సార్లు పఠిస్తూ..

భార్య భర్తల మధ్య గొడవల నుండి బయటపడడానికి ఒక మంచి మార్గాన్ని సూచిస్తున్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య శర్మ. 

భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ముఖ్యం. ఇద్దరు వ్యక్తులే అయినా రెండు కుటుంబాల కలయిక. చిన్న చిన్న కోపతాపాలతో సమస్యలు వచ్చాయని చాలా మంది విడిపోతుంటారు. వారి మధ్య జరిగిన మధురమైన ఘట్టాలను మర్చిపోయి కేవలం నెగిటివ్ అంశాలు మాత్రం తమతో కంటిన్యూ చేస్తూ వివాదాలను పెంచుకుంటూ ఉంటారు. అయితే, సమస్యలు సహజం. మన జీవితాలు నిలబెట్టుకోవాలనే ఆలోచన ఎప్పుడూ అవసరం. అది ఆ ఇద్దరికీ మంచిది. వారికి పిల్లలు ఉంటే వాళ్లకూ మంచిది. రెండు కుటుంబాలకూ ఆనందమే.

సమస్య వచ్చినప్పుడు ఆ ఇద్దరూ పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ఒక పద్ధతి. అయితే, దానికి దైవబలం కూడా తోడైతే మంచి ఫలితాలు వస్తాయి. సహజంగా ఇలాంటి భార్యాభర్తల గొడవలు, సంతానం లేట్ అవ్వడం లాంటి సమస్యలు రావడానికి కారణం కుజుడు. కుజగ్రహ ప్రభావం నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గాన్ని సూచిస్తున్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య శర్మ. ‘భార్య వల్ల భర్త మరణం లేదా భర్త వల్ల భార్య మృతి చెందడం. పరస్పర ఎడబాటు లేదా పూర్తిగా విడిపోవడం లాంటివి కుజగ్రహ ప్రభావం వల్ల ఏర్పడతాయి. (చదవండి: మీ ఇంట్లో వాస్తు దోషాలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పనులు తప్పక చేయండి! )

దీనికి కొన్ని పరిష్కారాలు ఉంటాయి. మన నడవడిక వల్ల కుజుడు మనకు మంచి చేస్తాడు. అంటే మంచిగా నడుచుకోవడం, నలుగురికి సాయం చేయడం, మంచి పనులు చేయడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది’ అని సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు

‘కుజుడు దోషకారకుడైనా కూడా మన నడవడిక బావుంటే, భగవంతుడిపై భారం వేస్తే పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తే కుజుడు కూడా శాంతిస్తాడు. ఆ సమస్యల నుంచి పరిష్కార ప్రయత్నాలు ఏమైనా చేస్తే అవి సఫలం అవుతాయి. అయితే, ముందు దేవుడి మీద భారం వేయాలి’ అని ఆయన అన్నారు.

ఎవరికైతే పైన పేర్కొన్న సమస్యలు ఉన్నాయో వాళ్లు ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ సాయంత్రం పూట ఓం గౌరీ గాంధారి ఛాండాలి మాతంగి పరి మాయో స్వాహా అంటూ 108 సార్లు అనుకుంటూ 108 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేయాలని వీరాపురం సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. దీనికి త్రికరణ శుద్ధి ముఖ్యం. అధిక కష్టాల్లో ఉన్నవారు చేయాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు అవసరం లేదని తెలిపారు.

(DISCLAIMER: ఈ విషయాన్ని 10టీవీ ధ్రువీకరించడం లేదు. అందుబాటులో ఉన్న సమాచారన్ని ఆధారంగా తీసుకుని అందించడమైనది)