శ్రావణ మాసం వచ్చింది.. కళ్యాణ ఘడియలు వచ్చేశాయ్.. నేటి నుంచి నవంబర్ వరకు శుభ ముహూర్తాల తేదీలు ఇవే..
జులై 24వ తేదీతో ఆషాడం ముగిసింది. 25వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. 26వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి.

Shubh Muhurat
Auspicious days in July to november 2025: శ్రావణమాసం అంటే మంచి రోజులకు అనువైన మాసం. కేవలం పండుగల మాసమే కాదు.. పెళ్లిళ్లు, శుభకార్యాలకుసైతం విశిష్టమైన మాసం. శ్రావణం వచ్చిందంటే చాలు శుభకార్యాలు, వ్రతాలు, నోములు, పూజలకు ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో పెళ్లిళ్లు చేసుకుంటే ఆ లక్ష్మీ దేవి.. హరిహరుల కరుణ కటాక్షం కొత్త దంపతులకు ఉంటుందని పండితులు చెప్తున్నారు.
జులై 24వ తేదీతో ఆషాడం ముగిసింది. 25వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. 26వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వేల సంఖ్యలో జంటలు ఏకం కానున్నాయి. ఆగస్టు నెల 23వ తేదీ వరకు మంచి రోజులు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.
జులై 25వ తేదీ నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు శ్రావణ మాసం ఉండగా.. తరువాత భాద్రపదం రానుంది. సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఇది శూన్యమాసం కావడంతో శుభముహూర్తాలు లేక శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. మళ్లీ సెప్టెంబర్ 23 నుంచి నవంబర్ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ వరకు మంచి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం శ్రావణమాసం కావడం జులై 26వ తేదీ నుంచి ఆగస్టు నెలలో అనేక సంఖ్యలో మంచి ముహూర్తాలు ఉండటంతో.. పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే కొత్త జంటలు ఈ రెండు నెలల్లోని మంచి ముహూర్తాల్లో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
మంచి ముహూర్తాలు ఉన్న రోజులు ఇవే..
♦ జులై : 26, 30, 31.
♦ ఆగస్టు : 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 21.
♦ సెప్టెంబర్ : 23, 24, 26, 27, 28.
♦ అక్టోబర్ : 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31.
♦ నవంబర్ : 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30.