Varuthini Ekadashi : వరుథిని ఏకాదశి.. ఉపవాసం ఉండి, ఇలా చేస్తే ఎంతో పుణ్యం..
వరుథిని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని, వామన అవతారాన్ని పూజిస్తారు. (Varuthini Ekadashi)
- Saketh U
- Updated on- April 12, 2026 / 11:48 PM IST
Varuthini Ekadashi Importance and Pooja
Varuthini Ekadashi : చైత్రమాసంలో అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని వరుథిని ఏకాదశి అంటారు. ఉత్తర భారత దేశంలో దీనిని బరుతిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. మనం వైకుంఠ ఏకాదశిని గ్రాండ్ గా చేసుకున్నట్టు ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ఈ వరుతిని ఏకాదశిని చేసుకుంటారు. ఈ ఏకాదశి చైత్ర పౌర్ణమి తర్వాత కృష్ణ పక్షం ఏకాదశి తిథి నాడు వస్తుంది. ఈ సంవత్సరం ఏకాదశి తిథి ఏప్రిల్ 13 తెల్లవారు జామున 1.16 గంటల నుంచి ఏప్రిల్ 14 తెల్లవారు జామున 1:08 గంటల వరకు ఉంది.
వరుథిని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని, వామన అవతారాన్ని పూజిస్తారు. భవిష్య పురాణంలో శ్రీ కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకు వరుథిని ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వివరించాడు. వరుథిని అంటే కవచం ధరించిన, రక్షించబడిన అని అర్థాలు వస్తాయి. అందుకే ఈ ఏకాదశిని పాటించేవారు చెడు నుండి రక్షించబడి మంచి అదృష్టాన్ని పొందుతారు అని చెప్తారు.
Also Read : ఈ బాధలు ఉన్నవారు కచ్చితంగా నరసింహ స్వామిని దర్శించండి.. ఏం జరుగుతుందో తెలుసా?
పురాణాల ప్రకారం వరుతిని ఏకాదశి రోజున విష్ణుమూర్తికి దీపం పెట్టి, పూజలు చేసి ఉపవాసం ఉండాలి. అలాగే భజన చేస్తూ జాగరణ చేస్తే కూడా మంచిది. వరుథిని ఏకాదశి నాడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఈ రోజు నూనె రాసుకోవడం, జుట్టు, గొల్లుకత్తిరించుకోవడం, హింస, లాంగిక కార్యకలాపాలు.. లాంటివి చేయరాదు. పూజ అనంతరం ఒక పూట మాత్రమే నైవేద్యాన్ని భోజనం చేసి ఉపవాసం ఉండొచ్చు. ఈ ఉపవాసాన్ని పాటించేవారు ముందు రోజు కూడా సాత్విక ఆహరం తీసుకోవాలి.
వరుథిని ఏకాదశిని పాటించడం వల్ల పాపాలు, బాధలు, రోగాలు, భయం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజున నీళ్లు, చల్లటి పదార్థాలు, గొడుగు, చెప్పులు, బెల్లం, చక్కర, పండ్లు, నువ్వులు, ఆవులు.. లాంటివి దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. వరుతిని ఏకాదశి నాడు ఈ నియమాలను పాటించడం వల్ల సమాజంలో శ్రేయస్సు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.
Also Read : మీకు పెళ్లి కావట్లేదా..? వెంటనే కోనసీమలో ఉన్న ఈ ఆలయంలో కళ్యాణం చేయించండి..
