Narasimha Swamy : ఈ బాధలు ఉన్నవారు కచ్చితంగా నరసింహ స్వామిని దర్శించండి.. ఏం జరుగుతుందో తెలుసా?
విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటి నరసింహ స్వామి అవతారం. (Narasimha Swamy)
- Saketh U
- Published On : April 11, 2026 / 07:33 AM IST
Narasimha Swamy
Narasimha Swamy : విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటి నరసింహ స్వామి అవతారం. భక్త ప్రహ్లాదుడి కోసం మానవ శరీరం, సింహం తలతో నరసింహస్వామిగా అవతరించి హిరణ్యకశపుడిని సంహరించారు. ముఖ్యంగా నరసింహ స్వామిని భయం పోవడానికి, రక్షణ కోసం ఎక్కువగా తలచుకుంటారు, పూజిస్తారు.
అయితే.. నరసింహ స్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. అపమృత్య దోషం పోతుంది. రుణభారం పోతుంది. అప్పులు ఉన్నవారు ఎక్కువగా నరసింహస్వామిని దర్శనం చేస్తే ఆయన అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసొచ్చి రుణభారం నుంచి బయటపడతారు. అంత గొప్ప స్వరూపం నరసింహ స్వరూపం అని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కూడా స్వయంగా ఓ ప్రవచనంలో తెలిపారు.
అప్పుల బాధలు ఉన్నవారు మీకు దగ్గర్లో ఉన్న నరసింహ స్వామి ఆలయాన్ని క్రమం తప్పకుండా దర్శించండి. మన తెలుగు రాష్ట్రాల్లో నవ నారసింహ క్షేత్రాలు అని 9 నరసింహ స్వామి ఆలయాలు ప్రసిద్ధి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. ఆ ప్రముఖ ఆలయాలను కూడా దర్శించండి.
తెలుగు రాష్ట్రాల్లోని నవ నారసింహ క్షేత్రాలు..
యాదాద్రి
సింహాచలం
అహోబిలం
మంగళగిరి
ధర్మపురి
వేదాద్రి
అంతర్వేది
పెంచలకోన
కదిరి
Also Read : Sri Veereswara Swamy Temple : మీకు పెళ్లి కావట్లేదా..? వెంటనే కోనసీమలో ఉన్న ఈ ఆలయంలో కళ్యాణం చేయించండి..
నరసింహ మంత్రాలు..
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్।
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం॥
ఈ నరసింహ స్వామి మహా మంత్రం భయాన్ని పోగొట్టి శత్రువుల నుండి, అపమృత్యువుల నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రతిరోజూ 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ధైర్యం కలుగుతాయి. ప్రతిరోజు కుదరకపోయినా మీకు కుదిరినప్పుడల్లా ఈ మంత్రాన్ని జపిస్తే మంచిది.
అలాగే ‘ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః॥’ అనే మంత్రాన్ని జపిస్తే రుణభారం తగ్గి ఐశ్వర్యం చేకూరుతుంది.
గమనిక : ఈ సమాచారం అంతర్జాలం నుంచి సేకరించడమైనది.
