Saturn Transit Revati 2026 : రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం.. ఆ రాశి వారు రాసి పెట్టుకొండి.. మీ అప్పులన్నీ తీరిపోతాయి.. ఉద్యోగం, ప్రమోషన్..!

Saturn Transit Revati 2026 :

Saturn Transit in Revati Nakshatra 2026 Big Fortune for These Zodiac Signs full details

Saturn Transit Revati 2026 : శని ప్రభావం అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ కర్మఫలదాతగా, న్యాయనిర్ణేతగా జ్యోతిష్యశాస్త్రంలో శని దేవుడిని అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తారు. పంచమ శని, సడేసతి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా ఏదైనా కావచ్చు.. శని ప్రభావం ప్రతి వ్యక్తి జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల మేష రాశి వారికి సడేసతి ప్రారంభం కాగా.. మీన రాశి వారికి మధ్య దశ సడేసతి, కుంభ రాశి వారికి తుదిదశ సడేసతి కొనసాగుతోంది. జ్యోతిష్యశాస్త్ర నిపుణుల ప్రకారం శని దేవుడు ఇప్పటికే రేవతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. రేవతి బుధునికి చెందిన నక్షత్రం కావడంతో.. ఈ సంచారం ద్వాదశ రాశుల వారి వ్యాపారం, బుద్ధి, సంబంధాలు, నిర్ణయాలపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది.

ప్రస్తుతం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించిన శని గ్రహం.. 2026 జూలై 27న వక్రగతిలోకి ప్రవేశించి, అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రానికి చేరుకుంటాడు. ఆ తర్వాత 2027 ఫిబ్రవరి 8న తిరిగి రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. మరి ఈ కాలంలో శని సంచారం.. ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపనుంది అనే వివరాలు తెలుసుకుందాం.

మేషం:

మేష రాశి వారికి శని 12వ స్థానంలో సంచరిస్తుండటం వల్ల ఈ రాశి వారు ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కినా.. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అలానే ఈ రాశి వారికి సడేసతి తొలి దశలో లాభనష్టాలు మిశ్రమంగా ఉండొచ్చని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

వృషభం:

శని రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం.. కుటుంబంలో శుభకార్యాలు, ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తాయంటున్నారు పండితులు.

మిథునం:

రేవతి నక్షత్రంలో శని సంచారం వల్ల మిథున రాశి వారు ఉద్యోగ రంగంలో పదోన్నతి పొందుతారు లేదంటే కొత్త అవకాశాలు లభించేందుకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి కెరీర్‌లో మార్పులు కలిసివస్తాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

కర్కాటకం:

శని సంచారం వల్ల  కర్కాటక రాశి వారు ఎదుర్కొంటున్న ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగం, విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలానే ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి.

సింహం:

రేవతి నక్షత్రం వల్ల సింహ రాశి వారిపై అష్టమ శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. అయితే గురు దృష్టి కారణంగా సింహ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

కన్య:

కన్య రాశి వారికి ఏడవ స్థానంలో శని సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, మంచి స్నేహాలు ఏర్పడతాయి. అంతా బాగానే ఉన్నా పెద్ద పెట్టుబడుల విషయంలో మాత్రం కన్య రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిక్కుల్లో పడతారు. జాగ్రత్త అవసరం.

తులా: 

శని ఆరో స్థానంలో సంచారం వల్ల తులా రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అప్పులు క్రమంగా తీరతాయి. తులా రాశి వారికి కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధిత విషయాల్లో విజయం పొందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలానే తులా రాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

వృశ్చికం:

పంచమ శని కారణంగా వృశ్చిక రాశి వారు పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఈ రాశి వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి.

ధనుస్సు:

ధనస్సు రాశి నాల్గవ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశి వారికి గృహ యోగాన్ని కలిగిస్తాడు. శని సంచారం వల్ల ధనస్సు రాశి వారు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణం, చదువులో మంచి విజయం, మెరుగైన ఫలితాలు వస్తాయి.

మకరం:

రేవతి నక్షత్రంలో శని సంచారం వల్ల మకర రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలానే ఇంటా, బయటా సంబంధాలు మెరుగుపడతాయి. వివాహ యోగం బలపడుతుంది. సమాజంలో గౌరవప్రతిష్టలు పెరిగే అవకాశముంది.

కుంభం:

శని సంచారం వల్ల కుంభ రాశి వారికి వ్యాపారం, మార్కెటింగ్ రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. వీరి దాంపత్య జీవితం సానుకూలంగా మారుతుంది. కొత్త అలవాట్లు జీవితంలో మార్పు తీసుకువస్తాయి.

మీనం:

మీన రాశి వారికి జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పటికీ, బుధుడు-గురు ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీన రాశి రైతులు, వ్యాపారవేత్తలకు ఇది చాలా అనుకూలమైన కాలం. ఈ రాశి వారి ఆర్థిక ప్రవాహం మెరుగుపడి, ఆరోగ్యం కూడా క్రమంగా బాగుపడుతుంది.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.