Sri Rama Navami 2026 Rajyoga : శ్రీరామ నవమి నాడు 2 విశేషయోగాలు.. ఈరాశుల వారి పంట పండినట్లే.. ప్రమోషన్, పెళ్లి.. అదృష్టమంటే వీరిదే..!
Sri Rama Navami 2026 Rajyoga : ఈ శ్రీరామ నవమి నాడు రెండు ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. వీటి వల్ల పలు రాశుల వారికి ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయంటున్నారు.
- Dharani Pilli
- Published On : March 26, 2026 / 09:49 PM IST
sri rama navami 2026 navpancham rajyoga and gajakesari yoga appears due to this these zodiacs get wealth and good fortune
Sri Rama Navami 2026 Rajyoga : హిందువులకు అతి ముఖ్యమైన పర్వదినాల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. దేశమంతా ఎంతో ఘనంగా శ్రీరామనవమి జరుపుకుంటారు. రేపు రాములోరి కల్యాణం కోసం దేశమంతా ముస్తాబయ్యింది. ఇదిలా ఉంటే ఈసారి శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగ నాడు రెండు శుభప్రదమైన యోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోందని పండితులు అంటున్నారు.
మార్చి 26న సంపదకు అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో పాటు గ్రహాలకు రాజైన గురువు, చంద్రుడి కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. అలానే గురువు, కుజుల ప్రభావంతో నవపంచమ రాజయోగం కూడా శ్రీరామనవమి నాడే ఏర్పడుతున్నాయి. ఈ రెండు రాజయోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తున్నాయి. మరి ఆ రాశులేవంటే..
మేష రాశి
ఈ శ్రీరామనవమి నుంచి మేష రాశి వారి దశ తిరగబోతోంది అంటున్నారు పండితులు. రామనవమి నాడు ఏర్పడే రెండు విశేష యోగాల వల్ల మేష రాశి వారిని దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. అలానే వీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారని.. ఉద్యోగులకు వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందని చెబుతున్నారు. అలానే రామనవమి నుంచి మేష రాశి వారి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుందని.. జీవిత భాగస్వామితో బంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందంటున్నారు పండితులు.
వృషభ రాశి
శ్రీరామనవమి నాడు ఏర్పడే రెండు యోగాల వల్ల విశేష ఫలితాలు పొందే రాశుల్లో వృషభ రాశి వారు కూడా ఉన్నారు. మార్చి 27 నుంచి వీరికి అత్యంత శుభప్రదంగా, లాభదాయకంగా మారుతుందని.. ఊహించని ధన లాభాలను పొందుతారని అంటున్నారు పండితులు. ఈ రాశి వారి ఆర్థిక స్థితి గణనీయంగా బలోపేతం అవుతుందంటున్నారు. వృషభ రాశి వారు పుణ్యక్షేత్రాలకు యాత్ర చేయడం ద్వారా అపారమైన ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. వృషభ రాశి వారు శ్రీరామనవమి నాడు ఇల్లు, ఆస్తి, భూమి, కొత్త వాహనం కొనుగోలు చేస్తే మంచిదంటున్నారు.
కన్య రాశి
కన్య రాశి వారికి శ్రీరామనవమి శుభ ఫలితాలను ఇస్తుందంటున్నారు పండితులు. శుభకార్యాల్లో పాల్గొంటారని.. ఉత్సాహం రెట్టింపవుతుందంటున్నారు. వైవాహిక జీవితం సామరస్యంగా సాగుతుంది. కన్య రాశి వారు ఈ సమయంలో ఒక విలువైన బహుమతిని అందుకునే అవకాశం ఉందంటున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం చేకూరే సూచనలున్నాయంటున్నారు పండితులు.
ధనుస్సు రాశి
శ్రీరామనవమి నుంచి ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయంటున్నారు. వీరు వేసుకున్న ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారస్తులకు చాలా కలిసి వస్తుందని.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా ఎలక్ట్రానిక్స్ సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయంటున్నారు. ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినే అవకాశం ఉందంటున్నారు.
కుంభ రాశి
శ్రీరామనవమి నాడు ఏర్పడే రెండు మహాయోగాల వల్ల కుంభ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది అంటున్నారు. కుటుంబంలోని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.. పెళ్లి కాని వారికి.. ఆ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి. దీంతో పాటు కుంభ రాశి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు చేకూరతాయంటున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని 10tv ధృవీకరించడం లేదు.
