Adhika Jyeshtha Purnima : అరుదైన అధిక జ్యేష్ఠ పౌర్ణమి.. ఉప్పుతో ఇలా చేస్తే.. వారంలోపే అప్పులన్నీ తీరతాయి..!

Adhika Jyeshtha Purnima : అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు పౌర్ణమి నాడు ఇలా చేస్తే.. వారం లోపే ఫలితం కనిపిస్తుంది అంటున్నారు పండితులు.

Sunday Adhika Jyeshtha Purnima Ultimate Salt Remedy to Clear Your Debts and Attract Money Fast

Adhika Jyeshtha Purnima : మే 31 ఆదివార, పౌర్ణమి కలిసి వస్తున్నాయి. అధిక మాసంలో వస్తున్న పౌర్ణమి కావడంతో జ్యేష్ఠ పౌర్ణమిగా పిలుస్తారు. ఆదివారం, జ్యేష్ఠ పూర్ణిమ కలసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. కనుక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి.. అప్పుల భారం నుంచి విముక్తులవుతారని పండితులు చెబుతున్నారు.

అప్పులు లేదా లోన్లు మనుషుల జీవితాలను అస్తవ్యస్తం చేయడమే కాకుండా, కుటుంబ సంబంధాలను పాడు చేస్తాయి. మనుషులు తమ పరువును కాపాడుకోవడానికి వడ్డీలకు డబ్బు తెచ్చి కడతారని, కానీ చివరికి ఆ పరువే పోయే పరిస్థితి వస్తుంటుంది. మన నిర్లక్ష్యం లేదా అనవసరపు ఖర్చుల వల్ల కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మరి ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు బయటపడాలంటే.. ఈ పరిహారాలు పాటించాలి.

నెగటివ్ ఎనర్జీ కోసం ఉప్పుతో పరిహారం

అధిక జ్యేష్ఠ పౌర్ణమి నాడు.. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి)ని తొలగించేందుకు ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేయాలని చెబుతున్నారు పండితులు.

  • ఇందుకోసం ఆదివారం ఉదయాన్నే ఒక పరిశుభ్రమైన గిన్నె తీసుకుని దానిలో నీళ్లు పోసి, వంటింట్లో కాకుండా ఇంటి ముఖ్య ద్వారం లోపల ఎక్కడైనా పెట్టాలి.
  • ఆ తర్వాత సముద్రపు ఉప్పు (Sea Salt) చేతిలో తీసుకుని ఇల్లంతా తిరగాలి.
  • ఆ తర్వాత ఆ ఉప్పును నీరు ఉన్న గిన్నెలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి.
  • మరుసటి రోజు ఉదయం ఆ నీటిని బయట పారబోయాలి.
  • ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

అప్పుల సమస్య కోసం కలర్ థెరపీ

అప్పుల బాధలు, ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ఈ ప్రక్రియను అధిక జ్యేష్ఠ పౌర్ణమి దినమైన ఆదివారం నాటి రాత్రి 7:30 తర్వాత చేయాలి.

  • ఒక గ్లాసు నీటిలో బ్రౌన్ లేదా నలుపు రంగు (కాఫీ పొడి లేదా ముగ్గు రంగులు) కలపాలి.
  • ఈ గ్లాసును ఒక పెద్ద బేసిన్‌లో ఉంచాలి.
  • ఆ తర్వాత ఆ గ్లాసులోని రంగు నీరు సాధారణ నీరుగా మారే వరకు పై నుండి మంచి నీటిని పోస్తూ ఉండాలి.
  • నీరు క్లీన్ అవుతున్నట్లుగానే, మీ మనసులోని సమస్యలు, అప్పుల బాధలు కూడా తొలగిపోతున్నాయని భావించాలి.
  • నీరు పూర్తిగా క్లీన్ అయ్యాక, ఆ నీటిని ఇంటి బయట పారబోయాలి.
  • ఇలా చేయడం వల్ల త్వరలోనే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయంటున్నారు పండితులు.

ముఖ్యమైన సూచనలు:

  • సమయం: చంద్రుడి శక్తి ఎక్కువగా ఉండే పౌర్ణమి రాత్రి 7:30 తర్వాత ఈ పరిహారాలు చేయడం ఉత్తమం.
  • నియమాలు: పీరియడ్స్ (నెలసరి) సమయంలో ఉన్న వారు ఈ పరిహారాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
  • ప్రయోజనం: ఈ పరిహారాలు పాటించడం వల్ల ఆగిపోయిన పనులు ముందుకు సాగడం, ఆర్థిక ఇబ్బందులు తగ్గడంతో పాటు ఇంట్లో మనశ్శాంతి కలగడం వంటి మార్పులను గమనించవచ్చు.

నమ్మకంతో పాటిస్తే మంచి ఫలితాలను చూస్తారని పండితులు చెబుతున్నారు.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.