×
Ad

ఈ వారం రాశిఫలాలు (డిసెంబర్ 7 నుంచి 13 వరకు).. లాభాలు, గౌరవం, కీర్తి, ఆనందం అన్నీ ఈ రాశివారికే..

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన ఈ వారం 12 రాశుల ఫలితాలు..

Horoscope

Zodiac Forecast: ఈ వారం రాశిఫలాలు (డిసెంబర్ 7 నుంచి 13 వరకు) 

గురువు మిధున రాశిలో వక్రస్థితి
గురువు మిధున రాశిలో వక్రగతి
రాహుకేతువులు కుంభ సింహ రాశులలో
రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో
కుజుడు ధనస్సు రాశిలో
చంద్రుడు మిధునం కర్కాటకం సింహ రాశులలో సంచారం

మేష రాశి: పిల్లలతో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చికాకులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి, ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహించాలి, అన్యదేశముల్లో నివసించుట, అనవసరపు విషయముల వైపు వెళ్లకూడదు. దత్తాత్రేయ ఆలయములు సందర్శించాలి.. మంచి ఫలితములు వస్తాయి.

వృషభ రాశి: ఉద్యోగలాభం, వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధి, శరీరంలో రుగ్మతలు, అకాల భోజనము, మోకాళ్ల నొప్పులు, ప్రయాణంలో ఇబ్బందులు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అధికలాభం. శ్రీ ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయిస్తే ఉత్తమ ఫలితములు వస్తాయి.

మిధున రాశి: ఉద్యోగంలో అనుకూలం, జాయింటు ద్వారా వ్యాపారంలో లాభాలు, గౌరవాభివృద్ధి, కీర్తి పరోపకార కార్యక్రములు చేయడం, కుటుంబంలో జీవితములో సౌఖ్యము, ఆనందము, మనోధైర్యము, ధనాదాయము ఉంటుంది. శరీర సౌఖ్యము ఉంటుంది. లలితా సహస్త్ర నామ పారాయణం చేస్తే శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి: నూతన వ్యాపారాలు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఉద్యోగము వస్తుంది. మధ్యవర్తితం మంచిది కాదు. పరోపకార కార్యములు చేయటం, ప్రయాణముల విషయంలో జాగ్రత్త అవసరము, సంతానము ద్వారం శుభవార్తలు వింటారు. నవగ్రహ ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి.

సింహ రాశి: ప్రయాణములలో ప్రమాదములు, మనోవిచారము, ప్రయత్నకార్యక్రములు చెడిపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి, కోర్టు సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి, వ్యాపారంలో లాభములు, విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

కన్యారాశి : ధన సంపదలు పెరగడం, నూతన వ్యాపారము, విధ్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత, ఉద్యోగంలో శుభ ఫలితములు, శుభ కార్యక్రమములలో పాల్గొనుట, వివాహ ప్రయత్నములు సఫలీకృతం కావడం దుర్గా స్తోత్ర పారాయణం చేయడం మంచిది.

తులా రాశి: ఆనందం, ధనము చేతికి అందడం ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపార విస్తరణ విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం బంధు మిత్రులతో వినోదములు, విందులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు సూర్య నమస్కారములు చేయడం ఉత్తమం.

వృశ్చిక రాశి: అదికారుల ఆగ్రహం, అవరోదములు, ప్రయూణములలో ఆటంకములు, గొడవలు బంధు మిత్రులతో సహనం పాటించాలి. శుభకార్యక్రమములలో పాల్గొనటం, సోమరితనం, అపాయములు రుద్ర జపం చేసిన మంచిది.

ధనస్సు రాశి: నూతన వ్యాపారము, నూతన ఉద్యోగములు, శుభవార్తలు, ధనధాన్య లాభములు ఇష్టమైన వ్యక్తుల కలయిక, వృత్తి ఉద్యోగములందు లాభములు కలుగుతాయి, మాట పట్టింపులు, ప్రయాణములో అలసట సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం ఉత్తమం.

మకర రాశి: నూతన వ్యక్తుల పరిచయం విధ్యార్ధులకు అనుకూలము, ఫ్యాన్సీ, వెండి బంగారు, నగలు విలువైన దుస్తులు కొనుగోలు చేయడం. చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారములో అభివృద్ధి రాణింపు ఉండును. శివ సహస్రనామార్చన ఉత్తమము.

కుంభ రాశి: స్థానభ్రంశము, అవ్యస్థల నివాసము కోర్టు సమస్యలు, మోసపోవడం, కుటుంబ కలహములు, మానసిక ఆందోళనలు, పుత్ర మిత్ర విరోధములు కలుగును. సరియైన నిర్ణయములు తీసుకోలేకపోవడం. అమ్మ వారి ఆరాధన వలన మేలు కలుగును.

మీన రాశి: వ్యాపారంలో లాభము, తీర్థయాత్రతలు, పుణ్యక్షేత్రములు, నదీస్నానం, నూతన వ్యాపారములు, ఋణబాధలు తగ్గడం, విరోధములు, మోకాళ్ల నొప్పులు, ఉద్యోగంలో అనుకులత, అనారోగ్యము. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మంచిది.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956