×
Ad

ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు).. ఈ రాశివారి వద్దకు ఒక్కసారిగా డబ్బు వచ్చి పడుతుంది..

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

Horoscope Predictions (Image Credit To Original Source)

ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు)
గురువు మిధున రాశిలో వక్రగతి
శని మీన రాశిలో
రాహుకేతువులు కుంభ సింహ రాశులలో
రవి బుధులు, కుజ శుక్రులు మకర రాశిలో ఫిబ్రవరి 3 వరకు 
ఫిబ్రవరి 4 నుంచి బుధుడు కుంభరాశిలో
శుక్రుడు 6 నుంచి కుంభ రాశిలో సంచారం
చంద్రుడు కర్కాటక, సింహ, కన్యా రాశులలో సంచారం 
ఈ వారంలో చాతుర్గహ కూటమి, త్రిగ్రహ కూటమి ఏర్పడింది

మేషం: ఈ వారం సామాన్యంగా ఉంటుంది, అన్ని రంగాలవారు ఏ పనిలోనూ పురోగతి లేక పోవడం వల్ల నిరుత్సాహంగా ఉంటారు. కుటుంబ సమస్యల వల్ల మానసిక అశాంతి, కోపాన్ని తగ్గించుకోవాలి, అలసట, బద్ధకం వ్యాపారంలో లాభములు, ఉద్యోగ భద్రత అవసరం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం: ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తిపరంగా ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆర్ధిక సమస్యలతో చికాకుతో ఉంటారు. మోసాలకు నష్టాలకు అస్కారము ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయుణములు ఫలవంతంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన వలన శుభఫలితములు కలుగుతాయి.

మిధున రాశి: ధర్మకార్యక్రమాలలో పాల్గొనుట, వృత్తి వ్యాపారములలో పని భారం పెరగడం, సంతానపరమైన బాధ, స్వల్పసుఖం, అధర్మ కార్యములకు సహకరించుట, స్త్రీమూలకంగా భయం కలగడం, లాభనష్టాల మిశ్రమం, అనవసరమైన విషయములలో తలదూర్చకూడదు. సంఘంలో గౌరవమర్యాదలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు. లక్ష్మీనారాయణ స్వామి వారి ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి : ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వృధా ప్రయాస, కుటుంబ సౌఖ్యం, ఆకస్మిక ధనలాభము, స్త్రీ మూలకంగా లాభం కలగడం, ఇతరులకు సహకారము అందించుట, బంధు మిత్రులతో వైరము, ఉద్యోగ వ్యాపార విషయములలో జాగ్రత్త అవసరము. హయగ్రీవస్తోత్ర పారాయణము చేయటం వల్ల శుభం కలుగును.

సింహ రాశి: శుభకార్య ప్రయత్న లాభం, స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారములలో అనుకూలము, విదేశీయానం, అనవసరపు ప్రయూణములు, శ్రమ అధికము, కుటుంబంలో శుభకార్యసిద్ధి, కోపముతో వివాదములు పెరగటం. నూతన కార్య సిద్ధి, ఆర్ధికం పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. లక్ష్మీనరసింహస్తోత్ర పారాయణం చేయవలెను.

కన్యా రాశి: వృధా ప్రయాణములు, ఆటంకముల తరువాత విజయం, కుటుంబ వ్యక్తులకు ఇబ్బందులు, మాటపట్టింపులు, వృధా ఖర్చులు పెరగడం, శుభకార్యములకు ధనవ్యయం, నూతన ప్రయత్నములు లాభించుట, వృత్తి ఉద్యోగములలో శ్రమ అధికం, ప్రముఖ వ్యక్తులతో కలయిక వలన లాభము కలుగును. కాలభైరవాష్టకం చదవడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

తులా రాశి: ఆకస్మిక ధనలాభము, వివాహ ప్రయత్నముల్లో అనుకూల ఫలితాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లడం, ఆర్థికంగా ధనలాభము, తీర్థయాత్రలు, బంధువులతో జాగ్రత్త అవసరము. విద్యార్థులు అధిక శ్రద్ధతో చదవాలి శుభఫలితాలు వస్తాయి. నవగ్రహస్తోత్ర పారాయణం చేయాలి.

వృశ్చిక రాశి: సమాజంలో గౌరవం, సుఖ నిద్ర, భోజన సౌఖ్యము, ఆభరణ ప్రాప్తి, విలువైన ఆభరణాలు కొనడం, వ్యాపారంలో లాభములు, స్థానచలనం, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, మహనీయుల కలయిక, వ్యాపారవృద్ధి, సుఖసంతోషాలు, శారీరక సౌఖ్యం: ఆంజనేయస్వామి ఆరాధన వలన ఉత్తమ ఫలితము లు కలుగుతాయి.

ధనస్సు రాశి: అనవసరపు విషయాల మీద దృష్టి పెట్టి గొడవలు కలగడం, శారీరక శ్రమ, శతృవృద్ధి, కోర్టు సమస్యలు, భార్య భర్తల మధ్య చిక్కులు, అకాలన భోజనం, వ్యాపారంలో తగాదలు, ఉద్యోగంలో అనుకులత, ధనలాభం, విలువైన ఆభరణములు కోనడం, స్థానచలనము: గణపతి కి ‘గ’ కార అష్టోత్తరముతో పూజ చేసిన మంచి ఫలితములు కలుగుతాయి

మకర రాశి: బంధు గృహాలలో సుఖభోజనం, ధన లాభం, ధాన్య సమృద్ధి, ఆనందం, వ్యాపారంలో మంచిలాభాలు, నూతన వ్యాపారములు కలిసి రావడం, ఉద్యోగంలో ఆదాయం పెరగడం, వివాహసంబంధములు కుదరడం. సంతానం ద్వారా శుభవార్తలు వినడం, ప్రయాణములు, తీర్థయాత్రలు: శ్రీ కృష్ణ మంత్ర జపము వలన శుభఫలితములు కలుగుతాయి.

కుంభ రాశి:ప్రయత్న కార్య జయము, ఆరోగ్యము, బంధుప్రీతి, ఇష్టకార్యసిద్ధి, ప్రతి పనిలో సానుకూలత, శుభకార్య నిర్వహణ, ఉద్యోగంలో అభివృద్ధి, శుభవార్త శ్రవణం, కార్యసిద్ధి, ధనలాభము, స్త్రీలకు అనుకూలము, విధ్యార్థులకు విద్యలో విజయం కలుగును.. గౌరి పూజ చేయడం వలన శుభ ఫలితములు కలుగుతాయి.

మీన రాశి: కుటుంబంలో కలహాలు, సంతానంతో విరోధం, అనారోగ్యం, ఉద్యోగ భంగము, వ్యాపారంలో అనుకూలత, విదేశాలకు వెళ్లడం, రుణాలు లభించడం, ఇంటి నిర్మాణము, విద్యార్థులకు విద్యలో ఆటంకములు, ఉద్యోగంలో లాభములు, గౌరవ మర్యాదలు లభించడం, పనులలో సానుకూలత, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి: దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన మంచి ఫలితములు కలుగుతాయి.

Brahma SRI DR Nayakanti Mallikarjuna Sharma

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Contact: 9849280956, 9515900956