×
Ad

ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు).. ఆ రాశివారి వద్దకు డబ్బు వచ్చి పడుతుంది!

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు)

గురువు మిధున రాశిలో వక్రగతి 
శని మీన రాశిలో 
రాహుకేతువులు కుంభ సింహరాశులలో
కుజుడు మకర రాశిలో
రవిబుధులు శుక్ర రాహువులు కుంభ రాశిలో సంచారం
చంద్రడు మకరం కుంభం మీన రాశులలో సంచారం
ఈ వారంలో చాతుర్గహ కూటమి ఏర్పడింది

మేషం : ఈ రోజు సామాన్యంగా ఉంటుంది, ఆదాయానికి మించి ఖర్చులు పెరగడం, ఆరోగ్యం కుదుట పడటం, వృత్తి, వ్యాపారములలో ఉద్యోగములలో అనుకూలంగా ఉండటం, ఆధిపత్య దోరణి విడిచి పెట్టి అందరితో కలసి పనిచేస్తే విజయం లభిస్తుంది, అన్ని వ్యవహరములలో దూకుడు తగ్గించుకోవాలి, కొత్త నిర్ణయములు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృషభం : ఈ రోజు మంచి ఫలితాలు కలుగుతాయి, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అధిక ఆదాయం కలగడం, ఈ రోజు వ్యాపారులకు శుభకరంగా ఉంది, మీ పోటీ దారులపై విజయం సాధిస్తారు, ఈ రోజు వ్యాపారంలో గణనీయమైన లాభములు కలుగుతాయి, కుటుంబ సభ్యులతో సంబంధ బాందవ్యాలు మెరుగు అవుతాయి, మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అమ్మవారి ఆరాధన చేయటం వల్ల ఉత్తమమైన ఫలితములు పొందుతారు.

మిధునం : ఈ రోజు సామాన్యంగా ఉంటుంది, వృత్తి పరంగా పురోగతి లోపిస్తుంది, ఆదాయం సామాన్యంగా ఉంటుంది, ఇతరులను మనసు నొప్పించే విధంగా మాట్లడటం మానుకుంటే మంచిది, జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది, ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమన్ చాలిసా పారాయణము వలన మంచి ఫలితములు కలుగుతాయి.

కర్కాటకం : ఈ రోజు మిశ్రమ ఫలితములు ఉంటాయి, వృత్తి పరంగా నిర్ణయాలు తీసుకోనే విషయంలో గందర గోళంగా ఉంటాది, ఆర్థిక సమస్యలు ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి, వివాదములు, గోడవలకు దూరంగా ఉండటం మంచిది, ఆర్ధికంగా నష్టపోయో ప్రమాదం ఉంది, వ్యాపారములో సమిష్ఠి నిర్ణయములతో ముందుకెళ్లడు మంచిది. నవగ్రహ శ్లోకములు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

సింహ రాశి: ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారములలో ఆశించిన ఫలితములు లేకపోవడం, చికాకు కలిగిస్తుంది. మిత్రులతో, బంధువులతో గొడవలు పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనల కారణంగా కుటుంబ సభ్యులతో వివాదములు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాల కారణంగా మానసిక ప్రదాంతత లోపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పారాయణ చేయటం వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కన్యా రాశి: ప్రయాణములో అపశ్రుతులు, రుణబాధలు, ఆరోగ్యము కుదుట పడుతుంది. వివాహ ప్రయత్నములు సఫలీకృతము కావడం, మానసిక ప్రశాంతత కలగడం, శుభకార్యక్రమమలు నిర్వాహణ, ఉద్యోగంలో చిక్కులు, కోర్టు సమస్య లు. వ్యాపారములలో లాభములు కలగడం, మిత్రులు, బంధువులతో సన్నిహితంగా ఉండటం. గణపతి గాయత్రీ మంత్రములు చదవడం వలన శుభ ఫలితములు కలుగుతాయి.

తులా రాశి: అనుకున్న పనులు ఆలస్యం కావడం, రుణబాధలు, గృహనిర్మాణం చేపట్టడం, ప్రతి పనిలో విజయం సాధించడం, ఆత్మవిశ్వాసం పెరగడం, సంపూర్ణ ఆనందం, మానసిక ఒత్తిడి, అనేక మార్గములలో ఆదాయం, శుభవార్తలు వినడం, సంఘంలో గౌరవము, స్త్రీ సుఖం, పెండింగ్ పనులన్నీ వేగవంతము కావడం, శారీరక సుఖం, నూతన వ్యాపారము చేయడం, కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి. సుందరకాండ పారాయణము చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

వృశ్చిక రాశి: గొడవలు, తగాదాలు, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి. అనవసరపు ప్రయూణములు, అకస్మిక ఖర్చులు వస్తాయి. అన్ని పనులు వాయిదా పడతాయి. విలువైన ఆభరములు, వాహనములు కొనుగోలు చేస్తారు.  కార్తవీర్యార్జున స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

ధనస్సు: శ్రమకు గుర్తింపు, అధికలాభములు, ప్రయాణముల వలన లాభములు, అనారోగ్యము, ప్రమాదములు, మానసిక బాధలు, కోపం, ఆవేశం, పెరగటం, కోర్టు సమస్యలు పరిష్కారము కావడం, నూతన వ్యాపారులు అధిక పెట్టుబడులు పెడతారు, ముందుచూపుతో వ్యవహరిస్తారు, అన్ని విషయములలో ముందంజలో ఉంటారు. అంగారక గ్రహస్తోత్ర పారాయణము చేయటం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు.

మకర రాశి: ఉద్యోగం లాభం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విమర్శలు తగ్గుతాయి. నూతన వ్యాపారముల వల్ల లాభములు కలుగుతాయి. విద్యార్థులకు విజయం. అకస్మిక ధనలాభం కలుగుతాయి. నూతన నిర్ణయములు, గృహముల నిర్మాణం, విదేశీయానం, పెద్దల ఆస్తులు కలసి రావడం వంటివి జరుగుతాయి. గణపతిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.

కుంభ రాశి: అన్ని రంగాలలో విజయం. ధన వ్యయం, కోర్టు పీడలు, బంధు మిత్రులతో గొడవలు, అధిక ఒత్తిడి, విమర్శలు, ఒప్పందాలు. సుఖనిద్ర ప్రమాణములు, తీర్థయాత్రలు, శుభవార్తాశ్రవణం, విశేష వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. లలితా సహస్ర స్తోత్ర పారాయణం చేయాలి.

మీన రాశి: జాయింట్ వ్యాపార నిర్వహణలో లోపాలు. అంచనాలు వాస్తవ రూపం దాల్చుతాయి. రుణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. అనవసరపు ప్రయాణాలతో ధనవ్యయం. స్త్రీ మూలకంగా లబ్ధి కలుగుతుంది. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. ముఖ్య కార్యాలలో ప్రధాన పాత్ర పోషిస్తారు. గౌరవమర్యాదలు పెరుగుతాయి. హడావుడితో నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభములు కలుగుతాయి.

Brahma SRI DR Nayakanti Mallikarjuna Sharma

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Contact: 9849280956, 9515900956