ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు)
గురువు మిధున రాశిలో వక్రగతి
శని మీన రాశిలో
రాహుకేతువులు కుంభ సింహ రాశులలో
శుక్ర రాహు రవిబుధులు కుంభ రాశులలో సంచారం
కుజుడు 23 వరకు మకర రాశిలో
24 నుంచి 28 వరకు కుజుడు కుంభ రాశిలో సంచారం
చంద్రుడు మేషం, వృషభం, మిధున రాశులలో సంచారం
ఈ వారంలో చాతుర్గహ కూటమి, పంచగ్రహ కూటమి ఏర్పడింది
మేష రాశి: ఈ రోజు సామాన్యంగా ఉంటుంది, ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది, మిత్రులతో మట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది, ఆర్థిక అంశాల పట్ల స్పష్టమైన విధానంతో ఉంటే మంచిది, కొత్త పనులేమి మొదలు పెట్టవద్దు, నూతన వస్త్రాభరణములు కొనుగోలు చేస్తారు, ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది, ఆరోగ్యం బాగుంటుంది. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.
వృషభ రాశి: ఈ రోజు శుభకరంగా ఉంటుంది, అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారంలో ఈ రోజు అద్భుతంగా ఉంటుంది, నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు, చర్చలు సఫలీకృతం అవుతాయి, కుటుంబ సభ్యుల సహాకారంతో పెద్దల ఆస్తి కలసివస్తుంది, సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు, స్నేహితులతో విహార యాత్రలకు వెళ్లడం, వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శించటం వలన శుభ ఫలితములు కలుగుతాయి.
మిధున రాశి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది, వ్యాపార వేత్తలు, వృత్తి నిపుణులు తమతమ రంగాలలో మెరుగైన పురోగతిని సాధిస్తారు, ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే నెలకొంటుంది, ఆకస్మిక ధనలాభము, బుద్ధి బలంతో ఈ రోజు అన్ని పనులు పూర్తి అవుతాయి, అన్ని రంగములలో పురోగాభివృద్ధి సాధిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి: ఈరోజు సామాన్యంగా ఉంటుంది, వృత్తి వ్యాపారములలో శ్రమకు తగిన ఫలితములు వస్తాయి, సామాజికంగా మీ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి, ఆస్తివ్యవహారాల్లో జాగ్రత్తవహించండి, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు, వాహన ప్రమాదములు జరిగే అవకాశం ఉంది, రుణభారము నుంచి విముక్తి చెందుతారు, వృత్తిపరంగా పొందిన విజయాల కారణంగా సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. శ్రీ గణపతి అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల శుభం జరుగుతుంది.
సింహం: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు, శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారు, అనారోగ్య సమస్యల నుండి ఉపసమనం లభిస్తుంది, కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది, వ్యాపారములలో ఆర్థిక లాభములు కలుగుతాయి, ప్రయాణముల వలన లాభములు కలుగుతాయి, కార్యసిద్ధి – శ్రీ హనుమ ఆరాధన వలన శుభం కలుగును.
కన్య: ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది ,మీ లక్ష్య సాధన కోసం పనిచేస్తారు, సహచరుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు, కుటుంబ సభ్యులతో తీర్ధయాత్రలకు ప్రణాలికలు వేస్తారు, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమములలో పాల్గోంటారు, వ్యాపారములలో ఆటంకములు, కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది – శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణము శుభకరం.
తుల: అనుకున్న పనులలో విజయం. ప్రతివిషయంలో విజయం సాధించడం, మంచి సలహాలు తీసుకుంటారు, ఉద్యోగ, వ్యాపారములలో లాభములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం. ప్రయాణములు చేయడం, తీర్థయాత్రలు చేయడం, కనకధార స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభఫలి తములు కలుగుతాయి.
వృశ్చికం: అధికవ్యయం, ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరము, అధిక ప్రయూణములు, అనవసరపు రాద్ధాంతములు, కోర్టు సమస్యలు, బంధుమిత్రులతో సహనంగా ఉండాలి, జాగ్రత్తలు అవసరం, అనవసరపు విషయముల మీద ఏకాగ్రత ఉండకూడదు. సుందరకాండ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
ధనస్సు: భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, కుటుంబంలో కలహములు, అనుకోని ప్రయాణములు, ఆకస్మిక ధనలాభము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రముల దర్శనము, విధ్యార్థులకు అనుకూలము, ప్రతిపనిలో విజయం. ఆరోగ్యము అనుకూలము, భూముల కొనుగోలు, బంధువులతో గొడవలు, ఇబ్బందులు కలుగుతాయి. శివాలయ ప్రదక్షిణలు చేయాలి.
మకరం: ప్రమాదమలు, వృథా ప్రయాణములు, శుభకార్యక్రమములలో పాల్గొనటం, ప్రయాణములు, ఆర్థికపరంగా అనుకూలము, కోర్టు సమస్యలు, నూతన వ్యాపారములు, బంగారు ఆభరణములు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం, నూతన వ్యాపారములు, వ్యాపార విస్తరణ. సుందరకాండ పారాయణం చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.
కుంభం: ప్రణాళికలు చేయడం, సర్వత్ర విజయం, వివాహమలలో పాల్గొనడం, వస్తువులు కొనుగోలు చేయడం, బంధువులతో గొడవలు, ఇబ్బందులు, అనవసరపు తగాదాలు క్రయవిక్రయముపై ఆసక్తి, ఇండ్లు కొనుగోలు చేయడం, పిత్రార్జితం కలిసి రావడం అనేక నిర్ణయములు తీసు కోవడం -విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభములు జరుగుతాయి
మీనం: దాయాదులతో కలహాలు ఉండవు. చర్మ సంబంధ రుగ్మతలు, స్తంభించిన వ్యవహారములు కార్యరూపములు దాల్చుతాయి. వివాదములతో విజయం సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అమ్మవారి ఆరాధన చేయాలి.
Brahma SRI DR Nayakanti Mallikarjuna Sharma
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956