Best Budget Cars : పెట్రోల్ టెన్షన్‌కు గుడ్‌బై.. రూ. 3.50 లక్షల్లో 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. 34కి.మీ మైలేజ్ పక్కా..!
Best Budget Cars : కొత్త కారు కొంటున్నారా? ఈ బడ్జెట్ కార్లు తక్కువ ధరతో పాటు ఎక్కువ మైలేజ్ అందిస్తూ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. ధర, ఫీచర్ల వివరాలివే..
- Sreehari A
- Updated on- June 26, 2026 / 06:45 PM IST
Best Budget Cars
- తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు
- 2026లో బెస్ట్ బడ్జెట్ కార్లు.. ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ..
- ఇవి కొనుక్కుంటే పెట్రోల్ టెన్షన్ లేదు.. టాప్ 5 మైలేజ్ కార్లు!
Best Budget Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో కారు కొనాలంటే ప్రతిఒక్కరూ చూసేది ఒకటే.. మైలేజ్.. చాలామంది డిజైన్, ధర అనుకుంటారు.. అన్నింటికి కన్నా ఎక్కువగా మైలేజీనే చూస్తారు.. ఎందుకంటే.. ఇప్పుడు ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి.. ప్రతినెలా ఫ్యూయల్ ఖర్చు తడిసి మోపెడవుతోంది.
అందుకే ఈ రోజుల్లో కొత్త కారు కొనాలంటే భయపడిపోతున్నారు. పెట్రోల్ ధరల (Best Budget Cars) మధ్య ప్రతి నెల ఫ్యూయల్ ఖర్చు తగ్గించుకోవాలంటే మంచి ఎఫిషియెన్సీ బడ్జెట్ కారు ఉండాల్సిందే.. ప్రస్తుత మార్కెట్లో రూ. 3.50 లక్షల నుంచి ప్రారంభమయ్యే మిడిల్ క్లాసు మెచ్చిన ఈ బడ్జెట్ కార్లు తక్కువ ధరతో పాటు ఎక్కువ మైలేజ్ అందిస్తూ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.
ఏ కారు కొనాలంటే.. ఈ లిస్టులో ఫస్ట్ నిలిచేది మాత్రం మారుతి ఆల్టో K10 కారు.. 1.0 లీటర్ ఇంజిన్‌తో 24.39–24.9kmpl పెట్రోల్ మైలేజ్ అందిస్తుంది. అదే CNG వెర్షన్‌లో చూస్తే 33 నుంచి కిలోగ్రాముకు 34 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ. 3.70 లక్షలు మాత్రమే ఉంటుంది.
Read Also : EPFO Nominee : PF ఖాతాలో నామినీ లేకపోతే డబ్బు ఎవరికీ వెళ్తుంది? నిజం తెలిస్తే షాక్ అవుతారు!
మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కారు ఇదే :
ఆ తర్వాత మారుతి ఎస్-ప్రెసో కూడా అదే 1.0 లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. పెట్రోల్‌లో 24kmpl, CNGలో కూడా 32km/kg వరకు మైలేజ్ అందిస్తుంది. దాంతో ఈ జాబితాలోనే మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కారుగా చెప్పవచ్చు.
మారుతి సెలెరియో కారు కూడా మరో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. పెట్రోల్ వెర్షన్ 25–26kmpl అందిస్తే.. సీఎన్‌జీ వెర్షన్ అద్భుతంగా 34.43km/kg వరకు మైలేజ్ అందిస్తుంది. తద్వారా ఈ కారు ధర సుమారు రూ. 4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
హ్యాచ్‌బ్యాక్ ప్రియుల కోసం టాటా టియాగో కూడా బెస్ట్ ఆప్షన్.. 1.2 లీటర్ ఇంజిన్‌తో 19.01kmpl మైలేజ్ ఇస్తుంది. తద్వారా ఈ కారు ధర కూడా రూ. 4.70 లక్షల నుంచే ప్రారంభమవుతుంది.
మంచి స్టైలిష్ లుక్ కోరుకునే వినియోగదారులకు రెనాల్ట్ క్విడ్ SUV-స్టైల్ డిజైన్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. 22.27kmpl వరకు మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ధర మార్కెట్లో రూ.4.30 లక్షల నుంచి లభ్యమవుతుంది. మొత్తంగా పరిశీలిస్తే.. మీకు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ కోరుకుంటే ఈ టాప్ 5 కార్లు 2026లో అద్భుతమైన కార్లుగా చెప్పవచ్చు.. మీకు ఇందులో ఏ కారు నచ్చితే అది ఇంటికి తెచ్చేసుకోండి.
