Best Mileage Bikes : కొత్త బైక్ కొనాలా? రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ ఇచ్చే 5 సూపర్ బైకులు ఇవే!

Best Mileage Bikes : లక్ష లోపు ధర, తక్కువ ఇంధనం వాడే బైక్ కోసం చూస్తున్నారా? మీకోసం భారత మార్కెట్లో 65kmpl నుంచి 80kmpl మధ్య మైలేజీని ఇచ్చే 5 బైకులు ఉన్నాయి. లేటెస్ట్ ధరలు, ముఖ్యమైన వివరాలివే..

Best Mileage Bikes

  • రూ. లక్ష లోపు ధరలో 5 బెస్ట్ మైలేజీ బైకులు
  • సరసమైన ధరలో కొత్త బైక్ కొనేవారికి ఇదే బెస్ట్ టైమ్
  • టీవీఎస్ స్పోర్ట్ నుంచి హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైకులు

Best Mileage Bikes : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో ఇంధన ధరలు నెలవారీ ప్రయాణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. 2026లో లక్ష లోపు మైలేజీకి ప్రాధాన్యతనిచ్చే బైకులకు ఫుల్ డిమాండ్ ఉంది. సరసమైన ధరలో రోజువారీ వినియోగానికి బైక్‌లను కోరుకునేవారికి 65kmpl నుంచి 80kmpl మధ్య మైలేజీని అందిస్తాయి. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందించే అనేక ఆప్షన్లు కూడా ఉన్నాయి.

టీవీఎస్ స్పోర్ట్ నుంచి హీరో స్ప్లెండర్ ప్లస్ Xtec 2.0 వరకు ఈ బైకులు తక్కువ (Best Mileage Bikes)నిర్వహణ ఖర్చులు, ఈజీ రిపేరింగ్, రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటాయి. క్లెయిమ్, ఎక్స్-షోరూమ్ ధరల ఆధారంగా భారత మార్కెట్లో లక్ష లోపు అత్యుత్తమ మైలేజీనిచ్చే 5 బైక్‌లను ఇప్పుడు నిశితంగా పరిశీలిద్దాం..

టీవీఎస్ స్పోర్ట్ :
టీవీఎస్ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ కేటగిరీలో స్పోర్ట్ బైకుల్లో ఇదొకటి. టీవీఎస్ క్లెయిమ్ ప్రకారం.. 80kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఈ టీవీఎస్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 57,950గా ఉంది.
మిగతా బైక్‌లలోకెల్లా అత్యధికం.

ఈ బైకులో 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 109.7cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ ఉపయోగించారు. పట్టణ, సెమీ-అర్బన్ పరిస్థితులలో తక్కువ నిర్వహణ ఖర్చులను కోరుకునే రైడర్‌లను బెస్ట్ బైక్. ఫీచర్లలో అల్లాయ్ వీల్స్, ఎంపిక చేసిన వేరియంట్లలో ఎలక్ట్రిక్ స్టార్ట్, నగర ట్రాఫిక్ వినియోగానికి తేలికపాటి బాడీతో వస్తుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ :
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర రూ. 56,742 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. హీరో మోటోకార్ప్ అత్యంత సరసమైన కమ్యూటర్ బైకుల్లో ఒకటిగా ఉంది. గ్రామీణ, పట్టణ మార్కెట్లలో కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉంది. 97.2cc ఇంజన్ నుంచి పవర్ వస్తుంది.

Read Also : Flipkart Sasa Lele Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్ ముగుస్తోంది.. ఈరోజే లాస్ట్ ఛాన్స్.. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లపై బెస్ట్ డీల్స్‌ మిస్ అవ్వకండి..!

ఎంపిక చేసిన వేరియంట్లలో ఈ బైక్‌కు i3S ఐడిల్ స్టాప్-స్టార్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. మెకానికల్ సెటప్, సర్వీస్ సౌకర్యం, ధరపై దృష్టి సారించే కొనుగోలుదారులకు బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు.

హోండా షైన్ 100 :
ఈ హోండా బైక్ ధర రూ. 65,393 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. భారత మార్కెట్లో ఈ బ్రాండ్ అత్యంత సరసమైన బైకుగా నిలుస్తుంది. 100cc కమ్యూటర్ సెగ్మెంట్‌లో నేరుగా పోటీనిస్తుంది.

ఈ బైకులో ప్రస్తుత ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 98.98cc ఇంజన్‌ ఉంది. రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ బైక్. హోండా షైన్ 100 భారత్ అంతటా భారీ డీలర్‌షిప్, సర్వీస్ నెట్‌వర్క్ కూడా బెనిఫిట్స్ అందిస్తుంది.

బజాజ్ ప్లాటినా 100 :
ఈ బైక్ ధర రూ. 68,711 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 70kmpl మైలేజీని ఇస్తుంది. ముఖ్యంగా రోజువారీ వాడకం, సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం బజాజ్ ప్లాటినా రేంజ్ రూపొందించింది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 102cc ఇంజన్‌తో రన్ అవుతుంది.

ఎగుడుదిగుడు రోడ్లపై ఈజీగా ప్రయాణించవచ్చు. లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, క్విల్టెడ్ సీట్ సెటప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ట్యూనింగ్, ఫుల్ లెవల్ పర్ఫార్మెన్స్ కన్నా మైలేజీకి ఎక్కువ ప్రాయిరిటీ ఉంటుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 :
ఈ జాబితాలో అత్యంత ఖరీదైన బైక్ ఇదే.. ఎక్స్-షోరూమ్ ధర రూ. 83,214గా ఉంది. ట్రెడిషనల్ కమ్యూటర్ బైక్‌లతో పోలిస్తే అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తుంది. 73kmpl మైలేజీని ఇస్తుంది. ఈ బైకులో 97.2cc ఇంజన్‌తో పాటు, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, LED లైటింగ్ ఫీచర్లు ఉన్నాయి.