Best Electric Scooters : మిడిల్ క్లాస్‌కు గేమ్ ఛేంజర్.. ఒక్క ఛార్జ్‌తో 242 కి.మీ రేంజ్! టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Best Electric Scooters : భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో డిలెక్ట్రిక్స్ SX25, ఓలా S1X, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, హీరో విడా VX2 వంటి మోడళ్లు మధ్యతరగతి కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి..

Electric Scooters

  • మిడిల్ క్లాసువారి కోసం 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
  • ఓలా S1X, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, హీరో విడా VX2
  • తక్కువ ధరకే మంచి రేంజ్, స్మార్ట్ ఫీచర్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్

Best Electric Scooters : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో చాలా మంది ఇప్పుడు సరసమైన ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేస్తున్నారు.

అందులోనూ మిడిల్ క్లాసు కస్టమర్లు ఈజీగా కొనేసుకోవచ్చు. 2026లో తక్కువ ధరకే మంచి రేంజ్, స్మార్ట్ ఫీచర్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ (Best Electric Scooters) అందించే అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్కూటర్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

లెక్ట్రిక్స్ SX25 :
మీరు సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తుంటే.. లెక్ట్రిక్స్ SX25 సరసమైన ఆప్షన్. ఈ స్కూటర్ ప్రారంభ ధర సుమారు రూ. 67,998కు లభిస్తుంది. ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా రోజువారీ చిన్న ప్రయాణాల కోసం తీసుకోవచ్చు. చీపెస్ట్ అండ్ లిమిట్ బడ్జెట్ ఫ్యామిలీలకు బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు.

Read Also : BSNL 199 Postpaid Plan : BSNL కస్టమర్లకు పండగే.. అత్యంత చౌకైన ప్లాన్ ఇదే.. ధర జస్ట్ రూ.199కే.. ఫుల్ బెనిఫిట్స్..!

ఓలా S1X :
భారత మార్కెట్లో ఓలా S1X స్కూటర్ అనేది పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఈ స్కూటర్ ధరలు సుమారు రూ. 84,999 నుంచి ప్రారంభమవుతాయి. వేరియంట్‌ను బట్టి 108 కి.మీ నుంచి 242 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుంది. మోడ్రాన్ డిజైన్, డిజిటల్ డిస్‌ప్లేతో అనేక స్మార్ట్ ఫీచర్లు అందిస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ :
మంచి బ్రాండ్ అద్భుతమైన సర్వీస్ నెట్‌వర్క్‌ కోరుకునేవారికి టీవీఎస్ ఐక్యూబ్ సూపర్ ఆప్షన్. ఈ స్కూటర్ ప్రారంభ ధర సుమారు రూ. 1.20 లక్షలు. టీవీఎస్ డీలర్ నెట్‌వర్క్ కారణంగా చిన్న పట్టణాలలో నివసించే కస్టమర్లకు కూడా అదిరిపోయే ఆప్షన్. రైడ్ క్వాలిటీ సౌకర్యవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది.

బజాజ్ చేతక్ :
బజాజ్ చేతక్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మెటల్ బాడీ డిజైన్‌తో వస్తుంది. ఈ చేతక్ ధర సుమారు రూ. 1.11 లక్షల నుంచి ఉంటుంది. ఈ స్కూటర్ దాదాపు 110 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. క్వాలిటీ ఫీచర్ల కన్నా లాంగ్ లైఫ్ మన్నిక ఉండే స్కూటర్‌ను కోరుకునే వినియోగదారులకు చేతక్ అద్భుతమైన ఆప్షన్.

హీరో విడా VX2 :
హీరో విడా VX2 ధర సుమారు రూ. 79,490 నుంచి మొదలవుతుంది. బ్యాటరీని ఈజీగా మార్చుకోవచ్చు. ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం లేని వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.