Electric Cars in India : ఒక్క ఛార్జ్‌తో హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా? 500 కి.మీ రేంజ్ అందించే 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Electric Cars in India : మీరు 500 కిలోమీటర్ల రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల కోసం చూస్తున్నారా? మారుతి, టాటా, మహీంద్రా, కియా కార్లు తక్కువ ఖర్చుతో అద్భుతమైన కార్లను అందిస్తున్నాయి.. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- October 2, 2026 / 05:30 PM IST
Electric Cars in India
- మారుతి సుజుకి ఇ-విటారా ARAI వెరిఫైడ్ 543కి.మీ రేంజ్
- టాటా సియెర్రా ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 665 కి.మీ.ల రేంజ్
- మహీంద్రా BE 6 స్పోర్టెక్ 557-683 కి.మీ.ల రేంజ్
Electric Cars in India : దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, కాలుష్యం కారణంగా చాలామంది వాహనదారులు ఎలక్ట్రిక్ కార్లవైపు మొగ్గుచూపుతున్నారు. పన్ను మినహాయింపులు, క్యాష్ సబ్సిడీలు వంటి ప్రోత్సాహకాలతో ప్రభుత్వం కూడా పౌరులను ఈవీలకు అప్‌గ్రేడ్ అయ్యేలా ప్రోత్సహిస్తోంది. ఒకవేళ మీరు కూడా కొత్త ఈవీ కారు కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే..
ప్రస్తుతం భారత మార్కెట్లో తక్కువ ఖర్చులో 5 ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తాయి. అయితే, కంపెనీ రేంజ్ రియల్ టైమ్ కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు. టాటా, మారుతి, మహీంద్రా, కియా వంటి కంపెనీలు దేశంలో ఈవీ మోడళ్లను అందిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఎలక్ట్రిక్ కారు ఎంచుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు.
మారుతి సుజుకి ఇ-విటారా :
మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ కారు ఏఆర్ఏఐ వెరిఫైడ్ 543 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.16,19,000 నుంచి రూ.20,21,000 వరకు ఉంటుంది. ఈ EV 49kWh, 61kWh వేరియంట్లలో లభిస్తుంది. 2WD డ్రైవ్ కారు, 45 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. కంపెనీ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది.
టాటా సియెర్రా ఈవీ :
ఎక్స్-షోరూమ్ ధర రూ.18,79,000 నుంచి రూ.26,48,000 వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జ్‌పై 665 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది (ARAI సర్టిఫైడ్). కేవలం 5.8 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారుపై కంపెనీ లైఫ్ టైమ్ వారంటీని అందిస్తుంది. రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 ఏళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.
మహీంద్రా బీఈ :
6 స్పోర్టెక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.20,20,000 ఉండగా ఇందులో కారు ధర రూ.19,45,000, ఛార్జర్ ధర రూ.75వేలు ఉంటాయి. ఈ కారు (MIDC సర్టిఫైడ్) 557 కి.మీ నుంచి 683 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. ఈ SUV కేవలం 6.44 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఇతర ఫీచర్లలో లెవెల్ 2 అడాస్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
టాటా హారియర్ :
ఈవీ కేవలం 6.3 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకోగలదు. ఈ ఈవీ ఫ్రంట్, మోటార్ 158PS, రియర్ మోటార్ 238PS పవర్ జనరేట్ చేస్తుంది, టార్క్ 504Nm వద్ద లభిస్తుంది. లైఫ్ టైమ్ HV బ్యాటరీ వారంటీతో వస్తుంది. ఈ SUVలో 6 టెర్రైన్ మోడ్‌లు ఉన్నాయి.
IP67 రేటింగ్‌తో రియర్-వీల్ డ్రైవ్ ఈవీ అందిస్తుంది. సేఫ్టీ పరంగా ఈ ఈవీ BNCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ ఈవీ రేంజ్ 538 కి.మీ నుంచి 622 కి.మీ వరకు ఉంటుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 25 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. టాటా హారియర్ ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.21,79,000కు లభిస్తుంది.
కియా సైరోస్ ఈవీ :
ఈ కారు ప్రారంభ ధర రూ.13,48,900 (ఎక్స్-షోరూమ్). ఈ సెగ్మెంట్‌లోనే 526 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది. 171PS పవర్, 255Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 39 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
