Samsung Galaxy S25 Ultra : పండగ చేస్కోండి.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ మరి ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 Ultra : బిగ్ బిలియన్ డేస్ సేల్కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర భారీగా తగ్గింది. దీని తాజా ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు 2025 ఫ్లాగ్‌షిప్‌ను 2026లో కొనడం ఇప్పటికీ సరైనదేనా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
Samsung Galaxy S25 Ultra
- ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా
- అక్టోబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
- రూ. 70,550 వరకు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు
Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? మీరు శాంసంగ్ లవర్స్ అయితే ఇది మీకోసమే.. పండుగ సీజన్‌కు ముందే ప్రీమియం స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9, 2026 నుంచి ప్రారంభమవుతుంది. అంతకన్నా ముందుగానే ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ధర తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ (12GB + 256GB) ప్రస్తుతం రూ. 1,29,999 బదులుగా రూ. 95,685కే లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో ధరను రూ. 4వేల వరకు తగ్గించుకోవచ్చు. మీ ఫోన్, వర్కింగ్ కండిషన్, పిన్ కోడ్ బట్టి పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ. 70,550 వరకు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లన్నింటినీ కలిపితే స్మార్ట్‌ఫోన్ ధర ఈజీగా రూ. 50వేల లోపు ధరకే లభిస్తుంది.
కొనాలా? వద్దా? :
ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లేతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, హై డిమాండ్ యాప్‌లు, గేమింగ్ ఏఐ ఫీచర్ల కోసం ఫ్లాగ్షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
కెమెరా సెటప్‌లో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 5x టెలిఫోటో కెమెరా, 10MP 3x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. డిజిటల్ జూమ్‌పై మల్టీ ఫోకల్ లెంగ్త్ అందిస్తుంది.
అంతేకాదు.. ఈ శాంసంగ్ ఫోన్లో 5,000mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఛార్జింగ్, IP68 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ ఇంటర్నల్ S పెన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ అదనంగా 7 జనరేషన్ OS అప్గ్రేడ్లు, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లను కూడా అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కొత్త గెలాక్సీ S26 అల్ట్రా కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. శాంసంగ్ లవర్స్ ఇలాంటి అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..
