educational toys
Kids Toys : పిల్లలకు ఆడుకునే బొమ్మలంటే చాలా ఇష్టపడతారు. ఏదైనా నచ్చిన బొమ్మ కనిపిస్తే ఎక్కువ సమయం అదే బొమ్మతో గడిపేస్తుంటారు. అయితే, మీ పిల్లలకు ఆనందంతో పాటు మరింత ఉత్సాహాన్ని అందించే టాయ్స్ చాలానే ఉన్నాయి. అందులో మీ పిల్లల కోసం సరైన టాయ్స్ ఎంచుకుంటే మాత్రం అది వారి మానసిక సామర్థ్యాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ బొమ్మలు కేవలం సరదా కోసమే కాదు.. ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. మీ పిల్లల్లో క్రియేటివిటీని బయటకు తీసేలా ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి స్కిల్స్ కూడా పెంచుతాయి. మీ పిల్లలకు రూ. 1,000 లోపు ధరలో బడ్జెట్ -ఫ్రెండ్లీగా ఉండే 5 క్రేజీ టాయ్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీ పిల్లలకు నచ్చిన టాయ్ ఎంచుకుని కొనేసుకోండి.
టర్టిల్‌బీ స్కిల్ బిల్డర్ క్యూబ్ :
అమెజాన్‌లో టర్టిల్‌బీ స్కిల్ (TurtleBee skill) బిల్డర్ క్యూబ్ కేవలం రూ. 799 ధరకు లభిస్తోంది. పిల్లలకు తెలివితో పాటు మోటార్ స్కిల్స్ పెంపొందించే మల్టీ యాక్టివిటీ లెర్నింగ్ టాయ్. షేప్ షార్టింగ్, బీడ్ మేజెస్, స్పిన్నింగ్ గేర్లు, నంబర్ బ్లాక్‌లు వంటి ఇంటరాక్టివ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. మంచి లెర్నింగ్ స్కిల్స్ నేర్పిస్తుంది.
పిల్లలకు సురక్షితమైన పదార్థాలతో తయారైన ఈ క్యూబ్ ఒక అద్భుతమైన ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, సెన్సరీ డెవలప్‌మెంట్ వంటి మరెన్నో స్కిల్స్ నేర్పిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆకర్షణీయమైన, విద్యాపరమైన గేమింగ్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
స్పియటీ Yo-Yo యాక్టివిటీ టాయ్ :
మింట్రా (Myntra)లో ఈ స్పియటీ యో-యో యాక్టివిటీ టాయ్ రూ. 824కి అందుబాటులో ఉంది. ఇందులో వేరబుల్ ఫ్యాన్ ఉంటుంది. వేసవిలో వేడి నుంచి పిల్లలను రక్షించి చల్లగా ఉంచుతుంది. ఈ టాయ్ బ్లేడ్‌లెస్ ఫ్యాన్ డిజైన్ కలిగి ఉంది. పిల్లలకు ఆడుకునే సమయంలో చాలా సురక్షితంగా ఉంటుంది. డిజిటల్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫ్యాన్ USB-C పోర్ట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, పిల్లలు బొమ్మగా కూడా ఆడుకోవచ్చు.
టాయ్ డిజిటల్ కెమెరా :
ఇదో డిజిటల్ కెమెరా.. ఈ టాయ్ కెమెరా ధర మార్కెట్లో రూ. 678కి అందుబాటులో ఉంది. పిల్లలు ఫొటోలు తీసేందుకు రియల్ డిజిటల్ కెమెరా. సరసమైన ధరలో ఈ డిజిటల్ కెమెరాలో రెండు కెమెరాలు ఉన్నాయి.
ఒకటి సెల్ఫీల కోసం.. మరొకటి ఆకర్షణీయమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఇందులోని కాంపాక్ట్ పిల్లలకు నచ్చిన డిజైన్‌తో కలర్‌ఫుల్ ఫొటోలను అందిస్తుంది. ఈ డిజిటల్ కెమెరా స్నేక్, టెట్రిస్, పుష్ బాక్స్ వంటి క్లాసిక్ గేమ్‌లతో సహా గేమింగ్ కన్సోల్‌గా కూడా పనిచేస్తుంది.
మ్యూజిక్, లైటింగ్‌తో బాట్ రోబో :
ఈ బాట్ రోబో కేవలం ధర రూ.649కే లభిస్తోంది. రూ.1,000 లోపు లభించే అత్యుత్తమ ఇంటరాక్టివ్ బొమ్మలలో ఇదొకటి. ఇందులో LED లైట్లు ఉన్నాయి. మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. పిల్లలను చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఇంటరాక్టివ్ టాయ్ డ్యాన్స్ కూడా చేయగలదు. రోబో అనేక కలర్ ఆప్షన్లలో వస్తుంది. పిల్లలు గంటల తరబడి ఈ రోబోతో గడిపేందుకు ఇష్టపడతారు.
మినీ పోర్టబుల్ కరోకే మిషన్ :
ఈ కాంపాక్ట్, మినీ పోర్టబుల్ కరోకే మిషన్ ధర కేవలం రూ. 489 మాత్రమే. ఆడుకునే పిల్లలు ఎంతో ఇష్టపడే బొమ్మ ఇది. పిల్లలు తమకు నచ్చిన పాటలను పాడుకోవచ్చు. రంగురంగుల డిజైన్‌తో కనిపించే ఈ కరోకే మిషన్ పిల్లలు ప్రతిరోజూ ఉత్సాహంగా ఆడుకునేందుకు అద్భుతమైనదిగా చెప్పవచ్చు.