BSNL Offer : BSNL ఆఫర్ ముగుస్తోంది.. ఇంకా ఒక్కరోజు మాత్రమే.. తక్కువ ధరకే 2 రీఛార్జ్ ప్లాన్లు.. 30 రోజులు ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ..!

BSNL Offer : బీఎస్ఎన్ఎల్ సరసమైన రీఛార్జ్ ప్లాన్లపై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లతో అదనంగా మరో 30 రోజులు వ్యాలిడిటీని పొందవచ్చు.

BSNL Offer : BSNL ఆఫర్ ముగుస్తోంది.. ఇంకా ఒక్కరోజు మాత్రమే.. తక్కువ ధరకే 2 రీఛార్జ్ ప్లాన్లు.. 30 రోజులు ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ..!

BSNL Offer

Updated On : March 30, 2025 / 3:39 PM IST

BSNL Offer : బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్‌ కోసం చూస్తున్నారా? ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL సరసమైన ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అంతేకాదు.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై ఎక్స్‌ట్రా వ్యాలిడిటీని కూడా అందిస్తోంది.

Read Also : Google Pixel 9a Sale : మంచి కెమెరా ఫోన్ కావాలా? గూగుల్ పిక్సెల్ 9aపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఏప్రిల్ 16నే ఫస్ట్ సేల్.. గెట్ రెడీ..!

హోలీ ఆఫర్ కింద BSNL రెండు రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ రీఛార్జ్ ప్లాన్లపై అదనపు వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ హోలీ ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. ఆసక్తిగల వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా మరో 30 రోజులు అదనంగా వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ రూ.1,499 రీఛార్జ్ ప్లాన్ :
1,499 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ఇప్పుడు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీన పొందుతారని BSNL (X) హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. మొదట్లో 336 రోజులు అందించే ఈ ప్లాన్.. మార్చి 1 నుంచి మార్చి 31 వరకు హోలీ ఆఫర్ కింద రీఛార్జ్ చేసుకుంటే.. ఇప్పుడు పూర్తి ఏడాది వ్యాలిడిటీ 365 రోజులు వరకు విస్తరించింది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఇంకా ఉన్నాయి.

ఎందుకంటే.. వినియోగదారులు భారత్ అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో ఫ్రీ నేషనల్ రోమింగ్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. వినియోగదారులు మొత్తం 24GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ డేటా పూర్తి అయ్యాక కూడా 40kbps తక్కువ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను యాక్సెస్ చేయొచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 రీఛార్జ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ ఆఫర్ కింద రూ.2,399 ప్లాన్ ఇప్పుడు 425 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, ఢిల్లీ, ముంబైలలో MTNL నెట్‌వర్క్‌లో కాంప్లిమెంటరీ కాల్స్ ఉన్నాయి.

Read Also : AC Blast : వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి.. అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. మీ AC సేఫ్టీ కోసం ఇలా చేయండి..!

ఈ ప్లాన్‌తో వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. ప్రతిరోజూ 100 ఫ్రీ SMSలతో పాటు, ప్లాన్ వ్యవధిలో మొత్తం 850GB డేటాను అందుకుంటారు. అదనంగా, BSNL మొబైల్ యూజర్లందరికి BiTV ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది. అలాగే వివిధ OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తోంది.