AC Blast : వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి.. అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. మీ AC సేఫ్టీ కోసం ఇలా చేయండి..!

AC Blast : వేసవిలో ఏసీ వాడుతున్నారా? ఏసీల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే చిన్నపాటి పొరపాట్లు కూడా ఏసీలు పేలళ్లకు దారితీయొచ్చు. ఈ స్మార్ట్ టిప్స్ ద్వారా ఏసీని సేఫ్‌గా ఉంచుకోవచ్చు.

AC Blast : వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి.. అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. మీ AC సేఫ్టీ కోసం ఇలా చేయండి..!

Smart tips to prevent your cooling machine

Updated On : March 30, 2025 / 3:21 PM IST

AC Blast : ఏసీలు వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. అసలే ఎండకాలం.. సమ్మర్ సీజన్‌లో ఎండల తీవ్రతను తట్టుకునేందుకు ఏసీలను ఎక్కువ గంటలు ఆన్ చేసి ఉంచుతుంటారు. ఏసీల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పేలుడు వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ఏసీలు ఎక్కువ గంటలు పనిచేస్తూనే ఉండటం వల్ల వేడిక్కి పేలుడు సంభవించవచ్చు.

Read Also : Top 5 Portable ACs : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? తక్కువ ధరలో టాప్ 5 పోర్టబుల్ ఏసీలు మీకోసం.. ఇళ్లంతా కూల్ కూల్..!

గదిని కూలింగ్ చేయడానికి ఏసీలు ఎంత అవసరమో వాటి నిర్వాహణ కూడా అంతే ముఖ్యం. అందుకే క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తుండాలి. ఏసీ ఓవర్‌లోడ్‌ను కూడా నివారించాలి. అదేపనిగా ఏసీని ఆన్ చేసి ఉంచకూడదు. కనీసం కొంత సమయమైన గ్యాప్ ఇవ్వాలి.

అంతేకాదు.. క్వాలిటీ ఉండే వైరింగ్‌ను మాత్రమే ఏసీకి వినియోగించాలి. ప్రమాదకరమైన ఏసీ బ్లాస్ట్‌లను నివారించవచ్చు. కూలింగ్ కోసమే ఏసీని వాడటం కాకుండా వేసవిలో ఏసీ నిర్వహణపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇళ్లు, ఆఫీసులలో ఎయిర్ కండిషనర్లు (ACలు) తప్పనిసరిగా మారాయి. అయితే, ఇటీవలి ఏసీల పేలుళ్ల ఘటనలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఏసీలతో భద్రతాపరమైన సమస్యలను లేవనెత్తుతున్నాయి.

ఈ సంఘటనలు తరచుగా ఏసీ వేడెక్కడం, రాంగ్ వైరింగ్ లేదా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల పేలుళ్లు సంభవిస్తాయి. మీ ఏసీ సురక్షితంగా ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఈ స్మార్ట్ టిప్స్ ద్వారా ఏసీల వాడకంతో కలిగే ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు.

ఏసీలు ఎందుకు పేలుతాయి? పేలుళ్ల వెనుక ఉన్న సాధారణ కారణాలివే :

  • ఏసీ పేలుళ్లు సాధారణంగా సాంకేతిక లోపాలు లేదా సరికాని వాడకం వల్ల సంభవిస్తాయి. కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.
  • ఓవర్ హీటింగ్ కంప్రెసర్ : ఒక ఏసీ బ్రేక్ లేకుండా నిరంతరం నడుస్తుంటే.. కంప్రెసర్ వేడెక్కి మంటలు అంటుకోవచ్చు.
  • రాంగ్ వైరింగ్ : పేలవమైన వైరింగ్, లూజ్ కనెక్షన్లు లేదా షార్ట్ సర్క్యూట్లు స్పార్క్స్, అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు.
  • గ్యాస్ లీకేజ్ : పాత లేదా దెబ్బతిన్న పైపుల నుంచి రిఫ్రిజెరాంట్ గ్యాస్ లీక్‌లు మండి పేలుడుకు కారణమవుతాయి.
  • సరైన నిర్వహణ లేకపోవడం : మురికి ఫిల్టర్లు, మూసుకుపోయిన వెంట్‌లు ఏసీపై ఒత్తిడిని కలిగిస్తాయి. పేలుడు ప్రమాదం పెరుగుతుంది.
  • వోల్టేజ్ హెచ్చుతగ్గులు : ఆకస్మిక విద్యుత్ పెరుగుదల ఇంటర్నల్ పార్టులను దెబ్బతీస్తుంది. ఏసీ వేడెక్కడానికి కారణమవుతుంది.

ఏసీ పేలుళ్లను నివారించే స్మార్ట్ సెక్యూరిటీ టిప్స్ మీకోసం :

  • మీ ఏసీని సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ ముందు జాగ్రత్త చర్యలను పాటించండి.
  • రెగ్యులర్ సర్వీసింగ్ తప్పనిసరి: గ్యాస్ లీకేజీలు, వైరింగ్ సమస్యలు, అడ్డుపడే ఫిల్టర్‌లను చెక్ చేసేందుకు మీ ACని ఏడాదికి కనీసం రెండుసార్లు ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించుకోండి.
  • ఏసీ ఓవర్‌లోడ్ : ఏసీని ఎక్కువ గంటలు ఆన్ చేసి ఉంచొద్దు. వేడెక్కకుండా ఉండేందుకు కాసేపు గ్యాప్ ఇవ్వండి.
  • వోల్టేజ్ స్టెబిలైజర్ : వోల్టేజ్ హెచ్చుతగ్గులు కంప్రెసర్‌ను దెబ్బతీస్తాయి. పవర్ సప్లయ్ కంట్రోల్ కోసం మీ ఏసీకి స్టెబిలైజర్‌ను ఉపయోగించండి.
  • ఏసీ చుట్టూ క్లీన్‌గా ఉంచండి : అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. దుమ్ము, ఆకులు, మండే పదార్థాలు లేకుండా ఉంచండి.
  • గ్యాస్ లీకేజీలను చెక్ చేయండి: ఏదైనా గ్యాస్ వాసన లేదా ఏసీ సరిగ్గా కూల్ కాకపోతే ఆపివేసి, వెంటనే టెక్నీషియన్‌కు కాల్ చేయండి.
  • సరైన వైరింగ్, ప్లగ్ పాయింట్ వాడండి : చౌకైన ఎక్స్‌టెన్షన్ వైర్లను నివారించండి. సరైన వైరింగ్‌తో పాటు ఏసీకి ప్రత్యేకమైన పవర్ సాకెట్‌ను వాడండి.

మీ ACలో వార్నింగ్ సైన్స్ కనిపిస్తే ఏం చేయాలంటే? :

Read Also : Window vs Split AC : ఈ వేసవిలో కొత్త ఏసీ కొంటున్నారా? విండోస్ ఏసీనా? స్ప్లిట్ ఏసీనా? ఏది కొంటే బెటర్? ఎక్స్‌పర్ట్స్ టిప్స్ మీకోసం..!

  • మీరు ఏదైనా మండే వాసన, పొగ లేదా అసాధారణ శబ్దాలను గమనించారా?
  • ఏసీని ఆపివేసి వెంటనే అన్‌ప్లగ్ చేయండి.
  • పొగ ఉంటే యూనిట్ మీద నీరు పోయకండి.
  • ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి టెక్నీషియన్‌ని పిలవండి.