Top 5 Portable ACs : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? తక్కువ ధరలో టాప్ 5 పోర్టబుల్ ఏసీలు మీకోసం.. ఇళ్లంతా కూల్ కూల్..!

Top 5 Portable ACs : కొత్తగా ఏసీ కొంటున్నారా? వేసవిలో తక్కువ ధరలో ఎక్కువ కూలింగ్ అందించే పోర్టబుల్ ఏసీల కోసం చూస్తున్నారా? టాప్ 5 పోర్టబుల్ ఏసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Top 5 Portable ACs : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? తక్కువ ధరలో టాప్ 5 పోర్టబుల్ ఏసీలు మీకోసం.. ఇళ్లంతా కూల్ కూల్..!

Top 5 Portable ACs

Updated On : March 23, 2025 / 4:44 PM IST

Top 5 Portable ACs : అసలే సమ్మర్.. వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ చల్లదనం కోసం ఎక్కువగా చూస్తారు. మీరు కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అందులోనూ పెద్ద ఏసీ కొనుగోలు చేస్తే ఇంటి గదిలో పెద్దగా సరిపోదు.

అలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడైనా సులభంగా పెట్టుకోగల ఎయిర్ కండిషనర్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌స్టాలేషన్ ఇబ్బంది లేని ఎయిర్ కండిషనర్ కోసం చూస్తుంటే.. పోర్టబుల్ ఏసీలు మీకో బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Best AC Prices : అసలే సమ్మర్.. కొత్త ఏసీ కొంటున్నారా? రూ. 30వేల లోపు ధరలో టాప్ 3 బెస్ట్ ఏసీలు ఇవే.. ఓసారి లుక్కేయండి..!

నేటి కాలంలో పోర్టబుల్ ఏసీలు బాగా పాపులర్ అవుతున్నాయి. ముఖ్యంగా అద్దె ఇంట్లో నివసించే వారికి, తరచుగా స్థలం మారే వారికి లేదా తక్కువ బడ్జెట్‌లో ఏసీ వాడేవారికి ఈ పోర్టబుల్ ఏసీలు అద్భుతంగా ఉపయోగడపతాయి.

భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 పోర్టబుల్ ఏసీల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆర్థికంగా మాత్రమే కాదు.. అద్భుతమైన కూలింగ్ వాతావరణాన్ని కూడా అందిస్తాయి.

1. బ్లూ స్టార్ 1 టన్ పోర్టబుల్ AC (CPA12DB) :
కూలింగ్ కెపాసిటీ : 1 టన్, చిన్న గదులకు సరైనది
ఫీచర్లు : స్లీప్ మోడ్, యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్, సెల్ఫ్ డైగోనిసిస్
ఈ ఏసీ కూలింగ్ క్వాలిటీతో మూవింగ్ డిజైన్, ఎక్కడికైనా ఈజీగా పోర్టబుల్ చేయొచ్చు.
ధర : దాదాపు రూ. 30వేల నుంచి రూ. 33వేల మధ్య ఉంటుంది.

2. క్రూయిజ్ 1 టన్ పోర్టబుల్ AC (PC12DC) :
కూలింగ్ కెపాసిటీ : 1 టన్
ఫీచర్లు : డ్యూయల్ మోటార్, డస్ట్ ఫిల్టర్, స్లీప్ మోడ్
హై పవర్ సామర్థ్యంతో వస్తుంది. తక్కువ పవర్ వినియోగిస్తుంది.
ధర : దాదాపు రూ. 32వేల నుంచి రూ. 35వేల మధ్య ఉంటుంది.

3. లాయిడ్ 1 టన్ పోర్టబుల్ AC (LP12B01TP) :
కూలింగ్ కెపాసిటీ : 1 టన్
ఫీచర్లు : డిజిటల్ డిస్‌ప్లే, రిమోట్ కంట్రోల్, టైమర్ మోడ్
ఏసీ డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. చిన్న ఇళ్ళు లేదా ఆఫీసులకు సరైనది.
ధర : రూ. 28వేల నుంచి రూ. 31వేల మధ్య ఉంటుంది.

4. క్రోమా 1.5 టన్ను పోర్టబుల్ AC (CRAC1201) :
కూలింగ్ కెపాసిటీ : 1.5 టన్ కొంచెం పెద్ద రూంలకు బెస్ట్ ఏసీ
ఫీచర్లు : రిమోట్ కంట్రోల్, ఆటో స్వింగ్, ఎల్ఈడీ డిస్‌ప్లే
పవర్‌ఫుల్ కూలింగ్, మెరుగైన ఎయిర్ సర్య్కూలేషన్
ధర : రూ. 33వేల నుంచి రూ. 36వేల మధ్య ఉంటుంది.

5. హనీవెల్ 1.2 టన్ పోర్టబుల్ AC (MN12CES) :
కూలింగ్ కెపాసిటీ : 1.2 టన్
ఫీచర్లు : 3-ఇన్-1 ఫంక్షన్ (AC + ఫ్యాన్ + డీహ్యూమిడిఫైయర్), వాషబుల్ డెస్ట్ ఫిల్టర్
ఫీచర్లు : అడ్వాన్స్ డిజైన్‌తో పవర్ కూలింగ్, స్మార్ట్ ఫీచర్‌లు ఉన్నాయి.
ధర : రూ. 35వేల నుంచి రూ. 38వేల మధ్య ఉంటుంది.

Read Also : Bank Account Rules : బిగ్ అలర్ట్.. బ్యాంకు అకౌంట్లపై రూల్స్.. అంత డబ్బు డిపాజిట్ చేయొద్దు.. ఈ లిమిట్ దాటితే ఐటీ నోటీసులు మీ ఇంటికి..!

పోర్టబుల్ ఏసీలకు ఇన్‌స్టాలేషన్ అవసరం ఉండదు.. పవర్‌ఫుల్ కూలింగ్ కోసం పోర్టబుల్ ఏసీలే బెస్ట్ ఆప్షన్. టాప్ 5 పోర్టబుల్ ఏసీలు భారతీయ మార్కెట్లో సరసమైన ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ పోర్టబుల్ ఏసీలతో మీ ఇంటి గది స్థలం కూడా సరిపోతుంది. వేసవికాలంలో రూమ్ అంతా కూల్‌గా ఉంచుకోవచ్చు. ఇప్పుడే స్మార్ట్ పోర్టబుల్ ఏసీని మీ ఇంటికి కొనితెచ్చుకోండి.